మ‌రోసారి ‘మైండ్‌బ్లాక్’ చేసిన మహేష్ బాబు కుమార్తె!

August 31, 2020 at 7:20 am

సినీ ఇండ‌స్ట్రీలో ఇంకా ఎంట్రీ ఇవ్వకపోయినా.. కావాల్సిన క్రేజ్‌ను ముందే సంపాదించుకున్న‌ సూపర్‌స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సితార సోషల్ మీడియాలో చాలా చలాకీగా ఉంటుంది. అందుకే ఆమె అంటే మహేష్ అభిమానులకి ప్రత్యేకమైన అభిమానం ఏర్ప‌డింది.

ఇక సితార చేసే చిలిపి, అల్లరి పనులకు సంబంధించిన వీడియోలను, డ్యాన్స్ వీడియోల‌ను మ‌హేష్ లేదా నమ్రత ఎవ‌రో ఒక‌రు సోషల్ మీడియా తరచూ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా సితార ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మైండ్‌బ్లాక్ అనే పాటకు డాన్స్ చేసి.. మ‌రోసారి ఆక‌ట్టుకుంటోంది. మహేష్ బాబు, రష్మిక జంట‌గా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే.

ముఖ్యంగా ఈ చిత్రంలో మైండ్‌బ్లాక్ సాంగ్ మహేష్ ఫ్యాన్స్‌కు ఎటువంటి ఎనర్జీని ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సాంగ్‌కు తాజాగా సితార అదిరిపోయే డాన్స్ చేసి.. తండ్రికి తగ్గ తనయ అని అనిపించుకుంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. మ‌‌రి ఆ డాన్స్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.

 

View this post on Instagram

 

hope you like it ♥️♥️ #SundayFunday @urstrulymahesh

A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) on

మ‌రోసారి ‘మైండ్‌బ్లాక్’ చేసిన మహేష్ బాబు కుమార్తె!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts