బాబు భక్తుడుని డామినేట్ చేస్తున్న ఆ ముగ్గురు…

August 7, 2020 at 10:39 am

చంద్రబాబుపైన ఎలాంటి విమర్శలు చేసినా మొదట స్పందించే టీడీపీ నేతల్లో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ముందు వరుసలో ఉంటారు. వైసీపీ నేతలు బాబుపై విమర్శలు చేస్తే బుద్దా వెంటనే లైన్‌లోకి వచ్చేసి వారికి కౌంటర్లు ఇచ్చేస్తారు. అసలు ఓ రకంగా చెప్పాలంటే బాబుకు బుద్దా ఓ భక్తుడు లాగా కాపలా ఉంటారు. ఈ విషయం పలు సందర్భాల్లో ఆయనే మీడియా ముందు చెప్పారు. తాను బాబుకు భక్తుడుని అని చెప్పుకున్నారు.

అయితే అలా బాబుకు భక్తుడుగా ఉన్న బుద్దాని ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీలు డామినేట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు టీడీపీ ఎమ్మెల్సీల్లో బాగా ఫైర్ బ్రాండ్ నాయకుడు అంటే బుద్దా పేరే వినిపించేది. కానీ ఈయనకు పోటీగా మరో ముగ్గురు ఎమ్మెల్సీలు రెడీ అయ్యారు. ఈ మధ్య కాలంలో ఆ ముగ్గురు బాగా హైలైట్ అవుతూ వస్తున్నారు. మూడు రాజధానుల బిల్లు వచ్చిన దగ్గర నుంచి ఆ ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీలు జగన్ ప్రభుత్వంపై గట్టిగానే పోరాడుతున్నారు.

పైగా చంద్రబాబుపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తే వెంటనే రియాక్ట్ అవుతూ కౌంటర్లు ఇస్తున్నారు. అలా బాబుకు సపోర్ట్‌గా ఉంటూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న ఎమ్మెల్సీ ఎవరో కాదు…అశోక్ బాబు, దీపక్ రెడ్డి, బీదా రవిచంద్రాయాదవ్‌లు. ఈ మధ్య కాలంలో వీరు ఏపీ రాజకీయాల్లో బాగా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా దీపక్ రెడ్డి, అశోక్ బాబులు టీవీ డిబేట్లలో బలమైన వాయిస్ వినిపిస్తున్నారు.

ఇక ఇటీవల మండలిలో పెద్ద ఎత్తున గొడవలు జరిగినప్పుడు ఈ ముగ్గురు టీడీపీ తరుపున గట్టిగానే నిలబడ్డారు. అయితే వీరు నిదానంగా హైలైట్ అవుతుంటే బుద్దా వెంకన్న ప్రభావం కాస్త తగ్గుతూ వచ్చినట్లు కనిపిస్తోంది. అయితే బుద్దా, విజయసాయికి కౌంటర్లు ఇవ్వడంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

బాబు భక్తుడుని డామినేట్ చేస్తున్న ఆ ముగ్గురు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts