షాకింగ్ న్యూస్‌.. గాయకుడు బాలసుబ్రహ్మణ్యానికి కరోనా!!

August 5, 2020 at 1:05 pm

క‌రోనా వైర‌స్‌.. ఈ పేరు వింటేనే ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వ్యాక్సిన్ లేని ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. చైనాలో పుట్టి ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌ను అత‌లాకుత‌లం చేస్తోంది. ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లితీసుకున్న క‌రోనా.. ఇంకెంత‌మందిని పొట్ట‌న‌పెట్టుకుంటుందో అర్థంకావ‌డం లేదు. సామాన్యుల నుంచి రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు అందరూ కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.

ఇక తాజాగా గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడ్డారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే తెలిపారు తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆయన ఓ వీడియో ద్వారా వివ‌రించారు. కొన్ని రోజులుగా తనకు జ్వరం వచ్చి పోతోందని, దగ్గుతో బాధపడుతున్నానని చెప్పారు. దీంతో వైద్య పరీక్షలు చేయించుకోవగా కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని తెలిపారు.

త‌న‌ అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్ద‌ని.. ప్రస్తుతం త‌న‌ ఆరోగ్యం మెరుగ్గానే ఉంద‌ని ఆయ‌న తెలిపారు. అభిమానుల అశీస్సులతో త్వరలోనే కోలుకుంటానని చెప్పారు. సమాజంలో కరోనా వైరస్ తీవ్రత చాలా తక్కువగా ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని ఎస్పీబీ వీడియోలో పేర్కొన్నారు.

షాకింగ్ న్యూస్‌.. గాయకుడు బాలసుబ్రహ్మణ్యానికి కరోనా!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts