ఎస్​పీ బాలసుబ్రహ్మణ్యంకి తీవ్ర అస్వస్థత..ఐసీయూలో చికిత్స

August 14, 2020 at 5:11 pm

దిగ్గజ గాయకుడు ఎస్​పీ బాలసుబ్రహ్మణ్యం అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.బాలుకు కరోనా సోకినట్టు ఈనెల 5న నిర్ధరణ అయింది. అప్పటినుంచి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే గురువారం రాత్రి ఒక్కసారిగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. నిపుణుల బృందం ఆయనకు ప్రత్యేక చికిత్స అందిస్తోంది.

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం.. తెలుగు, తమిళం, హిందీ ఇలా ఏ భాషలోనైనా అలవోకగా పాడే గాన గంధర్వుడు. 40 వేలకుపైగా పాటలు పాడి తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. తెలుగు సినీ సంగీత ప్రపంచానికి సంబంధించి ఘంటసాల వారసునిగా బాలును చెప్పుకుంటారు.కెరీర్‌ ప్రారంభంలో బాలీవుడ్‌లోనూ పాటలు పాడిన బాలు ఆ తర్వాత విరామం తీసుకున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత షారుఖ్‌ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’లో టైటిల్‌ గీతాన్ని ఆలపించారు. 2013లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు అందుకుని ఎస్పీ బాలుకు కమ్‌బ్యాక్‌ చిత్రంగా నిలిచింది.

ఎస్​పీ బాలసుబ్రహ్మణ్యంకి తీవ్ర అస్వస్థత..ఐసీయూలో చికిత్స
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts