రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మై సంచలన వ్యాఖ్యలు..!

August 13, 2020 at 5:57 pm

కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి మేనల్లుడు నవీన్ ఓ వర్గాన్ని కించపరుస్తూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు. దాంతో ఆ వర్గానికి చెందిన కొంతమంది ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి ఇంటిపై జరిగిన దాడి విషయంలో రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ఇంటిపై జరిగిన దాడి వెనుక ముస్లిం ఉగ్రవాదుల పాత్ర ఉందని హోం మంత్రి గురువారం ప్రకటించారు.

అయితే ఎమ్మెల్యేకు, అనుచరులకు మధ్య తీవ్రమైన భేదాభిప్రాయాలున్నాయన్నారు. అలాగే ఎమ్మెల్యేకూ, సోషల్ డెమోక్రెటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు తీవ్రమైన భేదాభిప్రాయాలు తలెత్తాయన్నారు. ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయని తెలిపారు. ఈ ఘటన పెద్ద కుట్రలో భాగమే అని తెలిపారు. సోషల్ డెమోక్రెటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పాత్ర కూడా పెద్దదే’’ అని ప్రకటించారు. ఈ విషయంపై లోతుగా విచారణ జరుపుతున్నామన్నారు. ఎస్‌డీపీఐ పాత్ర కూడా ఉందన్న వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని హోంమంత్రి బసవరాజ్ వెల్లడించారు.

రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మై సంచలన వ్యాఖ్యలు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts