క‌రోనా క‌ట్ట‌డిలో ఆ వంటింటి చిట్కా భేష్ అంటున్న నిపుణులు!!

August 3, 2020 at 10:08 am

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌ళ‌యం సృష్టిస్తున్న క‌రోనా వైర‌స్‌.. ఎప్పుడు అంతం అవుతుందో తెలియ‌డం లేదు. చైనాలో పుట్టుకొచ్చిన ఈ మ‌హ‌మ్మారి.. అంతు చూసేందుకు ప్ర‌పంచ‌దేశాలు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ క‌రోనా అదుపులోకి రావ‌డం లేదు. రోజురోజుకు ఈ ప్రాణాంత‌క వైర‌స్‌ మ‌రింత వేగంతో విజృంభిస్తోంది. ఇక ఈ క‌రోనాను అంతం చేయాలంటే.. ఖ‌చ్చితంగా వ్యాక్సిన్ వ‌చ్చి తీరాల్సిందే. దీంతో ప్ర‌పంచ‌దేశాల శాస్త్ర‌వేత్త‌లు క‌రోనా వ్యాక్సిన్ క‌నుగొనే దిశ‌గా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నారు.

Reasons to Use Steam Inhalation to Cure Cold & Cough

ఇదిలా ఉంటే.. కరోనా క‌ట్ట‌డిలో వంటింటి చిట్కాలు ఔషధాలుగా పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా నియంత్రణకు ఆవిరి చికిత్స (స్టీమ్‌ థెరపీ) బాగా పనిచేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రి వైద్యులు మూడు నెలల పాటు నిర్వహించిన పరిశోధనలో ఆవిరి చికిత్స కరోనాపై బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని కనుగొన్నారు. డాక్టర్ దిలీప్ కుమార్ నేతృత్వంలో పలువురు కరోనా‌ పాజిటివ్‌ రోగులపై స్టీమ్‌ థెరపీ ప్రయోగం నిర్వహించింది.

పరిశోధనలో 105 మంది బాధితులను రెండు గ్రూపులుగా విభజించారు. అందులో అసింప్టమాటిక్‌(లక్షణాలు లేని) బాధితులు రోజుకు మూడు సార్లు ఆవిరి పట్టడం వల్ల త్వరగా కోలుకున్నారు. లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్లు ప్రతి మూడు గంటలకోసారి ఐదు నిమిషాల పాటు ఆవిరి పట్టగా.. వారంలో సాధారణ స్థితికి వచ్చార‌ని వారు తెలిపారు. ఇక ఈ స్టీమ్‌ థెరపీలో క్యాప్సూల్స్, విక్స్, అల్లం, పసుపు వంటి వాటిని స్టీమ్ థెరపీలో ఉపయోగించ‌గా.. మంచి ఫ‌లితాన్ని ఇచ్చింద‌ని వారు చెబుతున్నారు.

క‌రోనా క‌ట్ట‌డిలో ఆ వంటింటి చిట్కా భేష్ అంటున్న నిపుణులు!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts