సుశాంత్ కేసులో రియాకు బిగ్‌షాక్ ఇచ్చిన సుప్రీం!!

August 5, 2020 at 3:19 pm

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి దాదాపు రెండు నెల‌లు గ‌డుస్తున్నా.. ఇప్పటికీ ఈయన మరణం మాత్రం మిస్టరీగానే ఉండిపోయింది. సుశాంత్ జూన్ 14న ఆదివారం ముంబైలోని బాంద్రాలోని తన ఫ్లాట్‌లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడ‌ని పోలీసులు తేల్చారు. దీంతో అంద‌రూ సుశాంత్‌ది ఆత్మ‌హ‌త్య‌ అని ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి స‌మ‌యంలో సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఒక్కసారిగా రియా చక్రవర్తి పేరు తెరపైకి వచ్చింది.

ఈమె తన కొడుకును చంపేసింది అంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. మ‌రోవైపు సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఆయన కుటుంబ సభ్యులతో పాటు మాజీ ప్రేయసి అంకిత లోఖండే కూడా చెప్తుంది. ఇలాంటి త‌రుణంలో రియా చక్రవర్తికి సుప్రీంకోర్టు బిగ్‌షాక్‌ ఇచ్చింది. ఆమెకు రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. అలాగే, కేసును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలన్న అభ్యర్థనను కూడా తిరస్కరించింది.

అలాగే, ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి మూడు రోజుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని ముంబై పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. కాగా, రియాకు ప్రొటెక్షన్ కల్పించేందుకు కోర్టు నిరాకరించడంతో బీహార్ పోలీసులు ఏ సమయంలోనైనా రియాను ప్రశ్నించే అవకాశం ఉంది.

సుశాంత్ కేసులో రియాకు బిగ్‌షాక్ ఇచ్చిన సుప్రీం!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts