మీడియా నన్ను నేరస్థులుగా చిత్రీకరిస్తుంది: రియా సుప్రీంలో పిటిషన్…!

August 10, 2020 at 6:19 pm

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మానసిక ఒత్తిడి కారణంగా గతనెల 14వ తేదీన స ముంబైలోని బాంద్రాలో తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే సుశాంత్ మరణం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎంతో సినీ భవిష్యత్ ఉన్న సుశాంత్ అర్ధాంతరంగా ఆత్మహత్యకు పాల్పడడం ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులను తీవ్రంగా కలిచివేసింది. ఇక ఆయన మరణం పట్ల రకరకాల రూమర్స్‌తో పాటు పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.

ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ప్రమేయముందంటూ సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేయడం సంచలనమైంది.ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తి పేరు కూడా ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో.. సుప్రీంలో ఆమె తాజాగా సోమవారం మరో పిటిషన్‌ను దాఖలు చేసింది.సుశాంత్ కేసులో బీహార్ పోలీసుల విచారణ సరికాదని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది రియా. ఇప్పుడు మీడియా వైఖరిపై కూడా పిటిషన్ దాఖలు చేసింది.సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు తనకు ఎటువంటి సంభంధం లేదని అనవసరంగా ఈ కేసులో మీడియా తనను నేరస్తురాలిగా చిత్రీకరిస్తోందని ఆ పిటిషన్‌లో రియా ఆరోపించినట్లు తెలుస్తుంది..

మీడియా నన్ను నేరస్థులుగా చిత్రీకరిస్తుంది: రియా సుప్రీంలో పిటిషన్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts