యాక్సిడెంట్ చేసింది రానా త‌మ్ముడు కాద‌ట‌.. ట్విస్ట్ ఇచ్చిన సురేష్ బాబు!

August 13, 2020 at 3:30 pm

నేటి ఉదయం ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చిన్న కుమారుడు, రానా తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందంటూ వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఓ వ్యక్తి టెస్ట్ డ్రైవింగ్ చేస్తుండగా బ్రీజా కారు, దగ్గుబాటి అభిరామ్‌ బీఎండబ్ల్యూ కారు మణికొండలో ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు కార్లు పాక్షికంగా ధ్వంసమైనట్లు ప్ర‌చారం జ‌రిగింది.

అంతేకాదు, అభిరామ్ కారు మరో కారును ఢీకొన్న ఈ సంఘటనలో అభిరామ్ రాంగ్ రూట్లో వెళ్లడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇరువురూ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారని కథనాలు వచ్చాయి.

అయితే తాజాగా ఈ విష‌యంపై స్పందించిన సురేష్ బాబు సూప‌ర్ ట్విస్ట్ ఇచ్చారు. తన కుమారుడు యాక్సిడెంట్ చేశాడనే వార్తలను ఆయన ఖండించారు. యాక్సిడెంట్ చేసింది అస‌లు తన కుమారుడు అభిరామ్ కాదని… ఆ కారు కూడా తన కుమారుడిది కాదని స్పష్టం చేశారు.

యాక్సిడెంట్ చేసింది రానా త‌మ్ముడు కాద‌ట‌.. ట్విస్ట్ ఇచ్చిన సురేష్ బాబు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts