స్వర్ణప్యాలెస్‌ ఘటనపై వేగవంతగా దర్యాప్తు..!

August 13, 2020 at 6:01 pm

విజయవాడ స్వర్ణప్యాలెస్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం అందరికి తేలిందే. ఈ ఘటనలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. అయితే ఈ హోటల్లో కరోనా పేషంట్లకు ప్రభుత్వం చికిత్స అందిస్తోంది. హోటల్ సిబ్బంది అప్రమత్తం కావడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ప్రభుత్వం స్వర్ణ ప్యాలెస్ ను ప్రభుత్వం కరోనా ఆస్పత్రిగా మార్చింది. ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది కరోనా రోగులు మృతి చెందిన విషయం తెలిసిందే.

అయితే స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో సెక్షన్‌ 160 సీఆర్‌పీసీ కింద పదిమందికి నోటీసులు అందజేశారు. ఇప్పటికే రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యానికి, బంధువులకు నోటీసులు జారీ చేసారు. నోటీసులు అందిన పదిమంది విచారణకు హాజరుకావాలని తెలిపారు.ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న హోటల్ యజమాని ముత్తవరపు శ్రీనివాసరావు, హాస్పిటల్ యజమాని రమేష్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్, విజయవాడ పరిసరాల ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

స్వర్ణప్యాలెస్‌ ఘటనపై వేగవంతగా దర్యాప్తు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts