చినబాబు కోసం ఆర్కేని టార్గెట్ చేసిన తమ్ముళ్ళు…

August 4, 2020 at 2:58 pm

ఎన్నో అంచనాల మధ్య 2019 ఎన్నికల బరిలో దిగిన నారా లోకేష్ అనూహ్యంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అమరావతి పరిధిలో ఉండే  మంగళగిరిలో పోటీ చేస్తే గెలుపు ఖాయం అనుకుని చంద్రబాబు, చినబాబుని పోటీ చేయించారు. కానీ ఊహించని విధంగా తొలిసారి పోటీ చేసిన లోకేష్ ఆళ్ళపై దాదాపు 7 వేల ఓట్ల మెజారిటీతో తేడాతో ఓటమిని చవిచూశారు. అయితే ఓడిపోయిన తర్వాత లోకేష్ మంగళగిరి స్థానాన్ని వదిలిపెట్టకుండా పనిచేసుకుంటున్నారు. ఇదే సమయంలో జగన్ మూడు రాజధానులని తీసుకురావడం లోకేష్‌కు కలిసొచ్చింది.

అప్పటి నుంచి ఆర్కేని వీక్ చేయడమే పనిగా పెట్టుకుని ముందుకెళుతున్నారు. అక్కడి రైతులని రెచ్చగొట్టి ఆర్కేపై విమర్శలు చేయిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ సోషల్ మీడియాలో ఆర్కేని గట్టిగా టార్గెట్ చేశారు. ఆళ్ళ రాజధాని ద్రోహి అంటూ తమ్ముళ్ళు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. తాజాగా మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో తమ్ముళ్ళు మరింత ఎక్కువగా ఆళ్ళపై విరుచుకుపడుతున్నారు.

ఎన్నికల ముందు అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పి, ఇప్పుడు మూడు రాజధానులకు మద్ధతు తెలుపుతున్నారని మండిపడుతున్నారు. అసలు ఆయన్ని ఎన్ని రకాలుగా టార్గెట్ చేయాలో అన్నిరకాలుగా చేస్తున్నారు. తాజాగా ఆర్కేపై  తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఓటర్లను, రైతులను మోసం చేసి ఇచ్చిన మాటకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆర్కేపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు.

ఈ విధంగా ఆయన్ని మంగళగిరి ప్రజల్లో నెగిటివ్ చేసి, ఎలాగైనా నెక్స్ట్ ఎన్నికల్లో చినబాబుని గెలిపించుకోవాలని తమ్ముళ్ళు ఆరాటపడుతున్నారు. ఒకవేళ ఆళ్ళ స్ట్రాంగ్‌గా ఉంటే చినబాబు గెలుపు సాధ్యం కాదు కాబట్టి, రాజధాని అంశాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. మరి చూడాలి తమ్ముళ్ళు ఆళ్ళని ఎంతవరకు వీక్ చేసి చినబాబుని గెలిపించుకుంటారో.

చినబాబు కోసం ఆర్కేని టార్గెట్ చేసిన తమ్ముళ్ళు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts