ప్రపంచంలో ఏపీ ఘనత: దేశంలో వందకు పది మంది ఆంధ్రులే…

August 12, 2020 at 11:53 am

ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ 7-10 వేల మధ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా కూడా 9 వేల కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ మొత్తం 2 లక్షల 44 వేల 549 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కారణంగా మంగళవారం 87 మంది మరణించగా..ఇప్పటివరకూ రాష్ట్రంలో 2 వేల 203 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇలా కరోనా కేసులు నమోదవుతుండటంతో ప్రతిపక్ష టీడీపీ నేతలు, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా కూడా మాజీ మంత్రి దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేసులు రెండున్నర లక్షలకు చేరుకుంటున్నాయని, మరణాలు 2200 దాటాయని, ఇది ప్రపంచంలో ఏపీ సాధించిన ఘనత అంటూ ఎద్దేవా చేశారు. కరోనా సోకే వాళ్లలో దేశంలో వందకు పది మంది ఆంధ్రులే అని, దేశంలో వైరస్ ఉధృతి.. జిల్లాలు 22 ఉంటే 13 ఏపీవే అని విమర్శించారు.

15 రోజుల్లో దేశంలో పెరుగుదల 0.42% ఉంటే, ఏపిలో50% ఉందని, ఏపీలో కరోనా అదుపు తప్పిందన్న కోవిడ్ ఇండియా వెబ్‌సైట్ హెచ్చరిక జగన్ ప్రభుత్వానికి కనపడుతుందా? అంటూ ఉమా ప్రశ్నించారు.

ప్రపంచంలో ఏపీ ఘనత: దేశంలో వందకు పది మంది ఆంధ్రులే…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts