మూడ్ ఆఫ్ నేషన్ సర్వే: టాప్‌లో జగన్.. చివ‌రిలో కేసీఆర్!!

August 8, 2020 at 2:31 pm

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ పేరిట ఓ టెలిఫోన్ సర్వే నిర్వహించింది. అత్యంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రులెవరంటూ చేపట్టిన ఈ సర్వేలో ఆంధ్రప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మూడోవ స్థానంలో నిలిచారు. ఈ సర్వేలో నెంబర్ వన్ గా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు పట్టం కట్ట‌గా.. అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచారు.

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి 4వ ర్యాంకు దక్కగా, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే 7వ స్థానంలో ఉన్నారు. అయితే అనూహ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలవడం గమనార్హం. ఈ జాబితాలో చివ‌రి నుంచి కేసీఆర్ ఆరోస్థానంలో నిలిచారు. ఈ స‌ర్వేలో యోగి ఆదిత్యనాథ్‌కు 24 శాతం ఓట్లు రాగా… కేజ్రీవాల్‌కు 15 శాతం, జగన్‌కు 11 శాతం చొప్పున ఓట్లు వ‌చ్చాయి.

కేసీఆర్‌కు 3 శాతం మాత్రమే ఓట్లు పడ్డాయి. ఇక 2 శాతం ఓట్లతో అశోక్ గెహ్లట్, యడియూరప్ప, భూపేష్ బెహగల్, శివరాజ్ సింగ్ చౌహాన్, విజయ్ రూపానీ కేసీఆర్ కంటే వెనుక ఉన్నారు. కాగా, గత జూన్ నెలలో రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరు గురించి సీ-ఓటర్ నిర్వహించిన సర్వేలోనూ కేసీఆర్‌కు టాప్-5లో చోటు దక్కలేని సంగ‌తి తెలిసిందే.

మూడ్ ఆఫ్ నేషన్ సర్వే: టాప్‌లో జగన్.. చివ‌రిలో కేసీఆర్!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts