టీడీపీలో మ‌రో వికెట్ ప‌డుతోందా…. ఆ ఎంపీ మార్పుపై ఊహాగానాలు…!

August 11, 2020 at 11:41 am

గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీకి ద‌క్కిన ముగ్గురు ఎంపీల్లో కీల‌కమైన విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని పార్టీ మార‌తానే ప్ర‌చారం గ‌డిచిన ఏడాదిగా జ‌రుగుతూనే ఉంది. అయితే, ఆయ‌న దీనిని పెద్ద‌గా సీరియ‌స్గా తీసుకోక‌పోవ‌డం.. తాను పార్టీలోనే ఉంటాన‌ని చెప్ప‌డం జ‌రిగిపోయాయి. అయితే, ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. నాని వైఎస్సార్ సీపీలోకి అడుగు వేస్తారంటూ వ‌చ్చిన ప్ర‌చారాన్ని మాత్రం తిప్పికొట్టారు. నేను టీడీపీలోనే ఉంటాన‌ని, వైఎస్సార్ సీపీలోకి అడుగు వేసేది లేద‌ని చెప్పుకొచ్చారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. కేంద్రంలోని బీజేపీ నేత‌ల‌తో మాత్రం నాని ట‌చ్‌లో ఉంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్న‌ప్పటి నుంచే ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం బీజేపీ సీనియ‌ర్ నేత‌ల‌ను కేంద్ర మంత్రుల‌ను ప‌దే ప‌దే క‌లిసేవారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న బీజేపీలోని పై నేత‌ల‌తో మంచి ప‌రిచ‌యాలే ఉన్నాయి.

అదే స‌మ‌యంలో త‌న‌కు టికెట్ ఇచ్చిన పార్టీకి మాత్రం కొంత మేర‌కు దూరంగానే ఉంటున్నారు నాని. అంతేకాదు.. అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీ మాత్రం సొంత‌పార్టీపైనే రెచ్చిపోతున్నారు. ఇటీవ‌ల కూడా చంద్ర‌బాబు అమ‌రావ‌తిపై చేసిన వ్యాఖ్య‌ల‌ను ప‌రోక్షంగా తిప్పికొట్టారు. ఈ క్ర‌మంలో నాని వైఖ‌రిని ప్ర‌శ్నించేందుకు కూడా ఎవ‌రూ సాహ‌సం చేయ‌డం లేదు. అయితే, ఇలా ఎన్నాళ్లు ఆయ‌న పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తారు. ఇప్పుడు ఇదే ప్ర‌శ్న పార్టీని వెంటాడుతోంది. అయితే.. తాజాగా మాత్రం నాని .. త్వ‌ర‌లోనే పార్టీ మార‌నున్నార‌నే వార్త ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఇప్పుడు ఈ న్యూస్ బెజ‌వాడ పాలిటిక్స్‌లో బాగా వైర‌ల్ అవుతోంది.

అమ‌రావ‌తిని కోరుకుంటున్న చంద్ర‌బాబు దానిని సాధించే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. మ‌రోప‌క్క‌, పార్టీ ప‌రిస్థితి కూడా నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోంది. ఈ నేప‌థ్యంలో తాను పార్టీలో ఉండి ప్ర‌యోజ‌నం లేద‌ని అనుకుంటున్నారు నాని. పైగా.. వ‌చ్చే మూడేళ్లు కూడా పార్ల‌మెంటులో చేసేది ఏమీ లేదు. దీంతో బీజేపీలోకి వెళ్లినా .. త‌న‌కు ఏదైనా గుర్తింపు ఉంటుంద‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. పైగా విజ‌య‌వాడ‌లో దుర్గ‌‌మ్మ ఆల‌యానికి ముందు నిర్మిస్తున్న ప్లైవోర్ అంశంలో తాను ఎంతో ప్ర‌య‌త్నాలు చేసినా.. ఇప్పుడు మాత్రం పేరు మ‌రొక‌రు కొట్టుకుపోతున్నార‌న్న ఆవేద‌న ఉంది.

ఎన్నిక‌ల్లో లోకేష్ లాంటి వాళ్లు ఓడిపోయినా తాను గెలిస్తే త‌న‌ను కాద‌ని.. ఓడిపోయిన ఉమా లాంటి వాళ్ల‌కే లోకేష్‌, చంద్ర‌బాబు ప్ర‌యార్టీ ఇవ్వ‌డం నానికి అస్స‌లు న‌చ్చ‌డం లేదు. పార్టీలో త‌న‌కు ఆది నుంచి కూడా గుర్తింపు లేద‌ని నాని వ‌గ‌రుస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయన పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని భావిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

టీడీపీలో మ‌రో వికెట్ ప‌డుతోందా…. ఆ ఎంపీ మార్పుపై ఊహాగానాలు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts