ఈనెల 17 నుంచి పరిమిత సంఖ్యలో వీసాల జారీ ప్రక్రియ మొదలు

August 14, 2020 at 4:15 pm

కరోనా నేపథ్యంలో స్తంభించిపోయిన విద్యార్థి వీసాల జారీ ప్రక్రియను ఈనెల 17 నుంచి పరిమిత సంఖ్యలో ప్రారంభించాలని యూఎస్ ఎంబసీ నిర్ణయించింది. ఢిల్లీలోని ఎంబసీ కార్యాలయంతో పాటు హైదరాబాద్, ముంబయి, చెన్నై, కోల్​కతా కాన్సులేట్ కార్యాలయాల్లో విద్యార్థి వీసాల ప్రక్రియ ప్రారంభం కానుంది.ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలో వీసాల దరఖాస్తులను నిర్వహిస్తామని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. ఈనెల 12లోగా అందిన అత్యవసర దరఖాస్తులను మొదట పరిశీలిస్తామన్నారు. ఆ తర్వాత మిగతా అపాయింట్​మెంట్లను ఖరారు చేస్తామని ఎంబసీ పేర్కొంది.

విద్యార్థుల తరగతులు ప్రారంభమయ్యే కనీసం మూడు వారాల ముందుగా అపాయింట్​మెంట్ పొందాలని తెలిపింది. ఇందుకోసం ఎంబసీ వెబ్​సైట్ చూడాలని తెలిపింది. ప్రత్యేక పరిస్థితుల కారణంగా అన్ని దరఖాస్తులను ప్రాసెస్ చేయలేమన్నారు. విద్యార్థుల తరగతులు ప్రారంభమయ్యే తేదీని బట్టి పరిశీలిస్తామని పేర్కొంది. ఇతర సాధారణ వీసాల జారీ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించేది ఇప్పడే చెప్పలేం కానీ.. వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని ఎంబసీ వెల్లడించింది. ఇతర హెచ్1బీ, హెచ్2బీ, హెచ్4, ఎల్, జే కేటగిరీ వీసాల నిర్ణీత కారణాలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించింది.

ఈనెల 17 నుంచి పరిమిత సంఖ్యలో వీసాల జారీ ప్రక్రియ మొదలు
0 votes, 0.00 avg. rating (0% score)