ఆ టాలీవుడ్ హీరోయిన్‌గాకు క‌రోనా పాజిటివ్‌!

August 14, 2020 at 7:26 am

క‌రోనా‌.. మూడ‌క్ష‌రాలే అయినా ప్ర‌పంచ‌దేశాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. చైనాలోని వూహాన్ న‌గ‌రంలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. అన‌తి కాలంలోనే దేశ‌దేశాలు వ్యాప్తిచెంది ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతోంది. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయారు. సామాన్యులే కాకుండా.. రాజ‌కీయ నాయ‌కులు, సెలబ్రెటీలు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా టాలీవుడ్‌లో మ‌రో హీరోయిన్ క‌రోనా బారిన ప‌డ్డారు.

ప్రముఖ హీరోయిన్ నిక్కీ గల్రానీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ.. కరోనా పాజిటివ్ అని తేలిందని.. తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపింది నిక్కీ గల్రానీ. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో స్వయంగా అనుభవిస్తున్నానని.. తనకు గొంతు నొప్పి, జ్వరం, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు ఉన్నాయన్నారు.

అయితే ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నానని.. కరోనా నుంచి క్రమంగా కోలుకుంటున్నట్టు తెలిపింది.తన ఆరోగ్యం కుదటపడాలని ప్రార్ధించిన వారందరికీ నిక్కీ గర్లానీ కృతజ్ఞతలు తెలియజేసింది. ఇక కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని కోరింది. అదే సమయంలో భౌతిక దూరం కూడా పాటించాలని కోరింది నిక్కీ గర్లానీ.

ఆ టాలీవుడ్ హీరోయిన్‌గాకు క‌రోనా పాజిటివ్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts