ఆ బుల్లితెర హాట్ యాంక‌ర‌మ్మ ఓవ‌రాక్ష‌న్‌తో వీళ్ల‌కు మండుతోందా…!

August 11, 2020 at 5:43 pm

తెలుగు బుల్లితెర రంగంలోనే ఓ పాపుల‌ర్ హాట్ యాంక‌ర‌మ్మ వ్య‌వ‌హారం ఇప్పుడు మీడియా స‌ర్కిల్స్‌లో… టీవీ స‌ర్కిల్స్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు ఇప్ప‌టికే క‌రోనా నేప‌థ్యంలో లాక్‌డౌన్ వ‌ల్ల చాలా మంది అవ‌కాశాలు కోల్పోతున్నారు. మ‌రి కొంద‌రు రెమ్యున‌రేష‌న్లు త‌గ్గించుకోవాల్సిన ప‌రిస్థితులు ఉన్నాయి. అయితే స‌ద‌రు యాంక‌ర‌మ్మ మాత్రం నా రేటు పెంచ‌క‌పోతే తాను యాంక‌రింగ్ చేస్తోన్న షోకు గుడ్ బై చెప్పేస్తున్నాన‌ని చెప్ప‌డంతో ఆ నిర్మాత గుండె గుబేల్ మంటోంద‌ట‌.

 

అస‌లు ఆ యాంక‌ర‌మ్మ ఈ రోజు ఇంత పాపుల‌ర్ అయ్యిందంటే దానికి కార‌ణం ఆ బుల్లితెర పాపుల‌ర్ షోనే అనుకోవాలి. ఈ షోతో వ‌చ్చిన పాపులారిటీతోనే ఆమె సినిమాల్లోనూ అవ‌కాశాలు సొంతం చేసుకుని.. అక్క‌డ భారీ రెమ్యున‌రేష‌న్లు అందుకుంది. ఆమె యాంక‌ర్‌గా ఉన్న షోకు ఇప్ప‌టికే స‌దరు నిర్మాతలు ప్రోగ్రామ్ నిర్వాహకులు చెల్లిస్తున్నారు. ఇప్పుడు అస‌లే కోవిడ్ ఉంద‌ని.. చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి వ‌స్తోంద‌ని.. నాకు నేను అడిగినంత రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌క‌పోతే షోను క్యాన్సిల్ చేసుకుంటాన‌ని కూడా వార్నింగ్ ధోర‌ణిలో మాట్లాడుతోంద‌ట‌.

 

ఇప్ప‌టికే ఈ హాట్ యాంక‌ర‌మ్మ ఈ బుల్లితెర పాపుల‌ర్ షోతో వ‌చ్చిన క్రేజ్, డ‌బ్బుతోనే ఖ‌రీదైన ల‌గ్జ‌రీ కార్లు, కాస్ట్‌లీ విల్లాలు, అపార్ట్‌మెంట్లు కొనుక్కుంది. అలాంటిది ఈ షోతో ఎదిగి.. ఇంత పాపులార్టీ తెచ్చుకుని ఇప్పుడు ఆ షో నిర్మాత‌ల‌నే బెదిరించే ధోర‌ణితో మాట్లాడుతుండ‌డంతో ఆ యాంక‌ర‌మ్మ తీరుపై వారంతా చిర్రు బుర్రు లాడుతున్నారు. ఆమెకు స‌రైన పోటీ లేక‌పోవ‌డంతో ఇప్పుడు ఇలా చేస్తోందంటూ మండిప‌డుతున్నారు. ఇత‌ర యాంక‌ర్లు కాస్త పుంజుకుంటే ఈ యాంక‌ర‌మ్మ‌కు చెక్ పెట్టే ప్ర‌య‌త్నాలు కూడా స్టార్ట్ అయ్యాయ‌ట‌.

ఆ బుల్లితెర హాట్ యాంక‌ర‌మ్మ ఓవ‌రాక్ష‌న్‌తో వీళ్ల‌కు మండుతోందా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts