టీఆర్ఎస్‌లో క‌రోనా క‌ల‌క‌లం.. మ‌రో ఎమ్మెల్యేకు పాజిటివ్‌!!

August 9, 2020 at 8:16 am

క‌రోనా వైర‌స్‌.. ఈ పేరు విన‌డానికి ప్ర‌జ‌లు భ‌య‌ప‌డిపోతున్నారు. చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల్లోనూ అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోగా.. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ఇదిలా ఉంటే.. టీఆర్ఎస్ పార్టీలో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. పార్టీలో ఒక్కొక్క‌రిగా క‌రోనా బారిన ప‌డుతున్నారు.

తాజాగా తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డికి కరోనా సంక్రమించింది. శనివారం ఆయనకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారణ కావడంతో వెంటనే హైదరాబాద్‌ ఫిల్మ్ నగర్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. శనివారమే టీఆర్ఎస్‌కు చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా సోకినట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఆయన భార్య ఇద్దరు పిల్లలకు కరోనా పాజిటివ్‌గా తేలింది.

కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే కరోనా బారినపడిన పలువురు కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు కోలుకున్నారు. ఇక కాంగ్రెస్‌ కురువృద్ధుడు, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మాత్ర‌మం కరోనాతో మృతి చెందారు. మ‌రోవైపు తెలంగాణ‌లో క‌రోనా కేసులు అంతకంత‌కూ పెరిగిపోతున్నాయి. ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య‌ 77513కి పెరిగింది. మ‌రియు మరణాల సంఖ్య 615కి చేరుకుంది.

టీఆర్ఎస్‌లో క‌రోనా క‌ల‌క‌లం.. మ‌రో ఎమ్మెల్యేకు పాజిటివ్‌!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts