అమెరికాలో వ్యాక్సిన్ విడుద‌ల ఎప్పుడంటే.. ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!!

August 7, 2020 at 8:36 am

చైనాలోని వూహాన్ న‌గ‌రంలో పుట్టుకొచ్చిన ప్రాణాంత‌క వైర‌స్ క‌రోనా.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను అల్ల‌క‌ల్లోలం చేస్తోంది. కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనాతో ప్ర‌పంచ‌దేశాలు యుద్ధం చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ క‌రోనా దూకుడు మాత్రం త‌గ్గ‌డం లేదు. ఎప్పుడు తగ్గుతుందో కూడా తెలియ‌డం లేదు. ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లితీసుకున్న క‌రోనాను.. అగ్ర‌రాజ్యాలు సైతం మ‌ట్టుపెట్ట‌లేక‌పోతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో క‌రోనా ట‌ర్ర‌ర్ సృష్టిస్తోంది.

అయితే ఇలాంటి త‌రుణంలో.. కరోనా మహమ్మారి అంతానికి రోజులు దగ్గర పడుతున్నాయని, అమెరికా చేతిలో నవంబర్ 3 నాటికి వైరస్ ను అంతం చేసే వ్యాక్సిన్ ఉంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు ఓ రేడియో కార్యక్రమం ద్వారా మాట్లాడిన ఆయన, అమెరికా వద్ద ఉన్న కరోనా వ్యాక్సిన్ సమాచారాన్ని చైనా దొంగిలించిందా? అన్న విషయాన్ని తాను చెప్పలేను కానీ, అది చైనాకు సాధ్యమయ్యేపనేనని మాత్రం నమ్ముతున్నానని కీలక వ్యాఖ్యలు చేశారు.

వ్యాక్సిన్ తయారీలో అమెరికా సంస్థలు ముందంజలో ఉన్నాయని ఆయన అన్నారు. అయితే అటు అమెరికాలో ఈ సారి అధ్యక్ష ఎన్నికలు సైతం నవంబర్ 3నే జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నవంబర్ తొలివారంలోనే వ్యాక్సిన్ యూఎస్ వద్ద ఉంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఎన్నికల్లో గెలిచేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ప్రత్యర్థి వర్గం ఆరోప‌ణ‌లు చేస్తోంది.

అమెరికాలో వ్యాక్సిన్ విడుద‌ల ఎప్పుడంటే.. ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts