తెలంగాణ‌లో అన్‌లాక్ 3.0… కొత్త రూల్స్ ఇవే… !

August 1, 2020 at 11:09 am

క‌రోనా నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ క్ర‌మ‌క్ర‌మంగా ఎత్తేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌ను ద‌శ‌ల వారీగా ఎత్తేస్తూ వ‌స్తున్నారు. తాజాగా కేంద్రం జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా తెలంగాణ ప్ర‌భుత్వం అన్‌లాక్ 3.0 మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. ఈ నిబంధ‌న‌లు ఆగ‌స్టు 31వ తేదీ వ‌ర‌కు అమలు కానున్నాయి. ఈ అన్‌లాక్ 3.0లో ప‌లు వాణిజ్య కార్య‌క‌లాపాల‌కు అనుమ‌తులు ఇస్తున్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌ల‌వుతోన్న రాత్రి క‌ర్ఫ్యూ ఇక ఉండ‌దు. రాత్రి, ప‌గ‌లు తేడా లేకుండా ఎవ‌రు అయినా ప్ర‌యాణాలు చేసేందుకు వీలు క‌ల్పించింది. ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లే వారికి, ఇత‌ర రాష్ట్రాల నుంచి తెలంగాణ‌కు వ‌చ్చే వారి విష‌యంలో ఎలాంటి ఆంక్ష‌లు ఉండ‌వు.

కేసుల తీవ్ర‌త ఎక్కువుగా ఉన్న కంటోన్మెంట్ జోన్ల‌లో మాత్రం లాక్‌డౌన్ అమ‌లు అవుతుంది. ఇక స్కూల్స్‌, కాలేజ్‌లు, కోచింగ్ సెంట‌ర్ల‌పై ఆంక్ష‌లు ఈ నెలాఖ‌ర‌వ‌ర‌కు అమ‌ల్లోనే ఉంటాయి. ఈ క్ర‌మంలోనే సినిమా హాల్స్‌, మాల్స్‌, స్విమ్మింగ్ ఫూల్స్‌, బార్లు, ప‌బ‌లు, మెట్రో రైళ్ల‌పై కూడా ఆంక్ష‌లు కంటిన్యూ అవుతాయి. ఇక ఏ స‌భ‌లు, స‌మావేశాల‌కు కూడా అనుమ‌తులు ఇవ్వ‌రు. ఇక లాక్‌డౌన్‌లో అమలు చేసిన‌ట్టుగానే పెళ్లిళ్ల‌కు కేవ‌లం 50 మందిని మాత్ర‌మే అనుమ‌తి ఇస్తారు.

ఇక ద‌హ‌న సంస్కారాల‌కు మాత్రం 20 మంది వ‌ర‌కు అనుమ‌తి ఉంటుంది. ఏదేమైనా తెలంగాణ ప్ర‌భుత్వం అంత‌రాష్ట్రాల మ‌ధ్య ప్ర‌యాణం విష‌యంలో ఆంక్ష‌లు ఎత్తివేయ‌డం నిజంగానే బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. ఇక రాత్రి వేళ్ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు అవుతోన్న క‌ర్ఫ్యూ వ‌ల్ల షాపులు లేక కోట్లాది రూపాయ‌ల బిజినెస్ దెబ్బ‌తింది. ఇప్పుడు ఇది షురూ అయ్యే అవ‌కాశం ఉంది.

తెలంగాణ‌లో అన్‌లాక్ 3.0… కొత్త రూల్స్ ఇవే… !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts