అన్ లాక్ 3.0: ఈ ప‌ని చేయ‌క‌పోతే మీరు ఏపీ వెళ్ల‌లేరు… అడ్డంగా బుక్ అయిన‌ట్టే..!

August 1, 2020 at 12:05 pm

కరోనా నేప‌థ్యంలో సుదీర్ఘ‌కాలంగా కేంద్ర ప్ర‌భుత్వం విధించిన లాక్ డౌన్ ఆంక్ష‌లు క్రమ క్ర‌మంగా స‌డ‌లిస్తూ వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే అన్‌లాక్ 3.0 రూల్స్ కూడా విడుద‌ల‌య్యాయి. ఇందులో భాగంగా రాష్ట్రాల మ‌ధ్య ప్ర‌యాణాల‌కు ఎలాంటి అనుమ‌తులు అక్క‌ర్లేదు. అయితే ఇదే అంశంపై ర‌క‌ర‌కాల సందేహాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏపీకి వ‌చ్చే వారు పాత నిబంధ‌న‌లే అమ‌లు అవుతున్నాయ‌న్న విష‌యం తెలుసుకోక‌పోతే అడ్డంగా బుక్ అయిన‌ట్టే.

కేంద్రం అంత‌రాష్ట్రాల మ‌ధ్య ప్ర‌యాణాల విష‌యంలో రూల్స్ ఎత్తివేసినా ఏపీ ప్ర‌భుత్వం మాత్రం త‌మ రాష్ట్రంలో కేసులు పెరుగుతుండ‌డంతో చాలా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ క్ర‌మంలోనే పాస్‌లు లేకుండా ఏపీకి వ‌స్తున్న వారిని తిప్పి వెనక్కి పంపించేస్తున్నారు పోలీసులు. ఏపీకి వ‌చ్చే వారు త‌ప్ప‌నిస‌రిగా ఆ రాష్ట్రానికి చెందిన స్పంద‌న యాప్ డౌన్ లోడ్ చేసుకుని త‌మ వివ‌రాలు, అవ‌సరాలు పేర్కొనాల్సి ఉంది. అలా ద‌ర‌ఖాస్తు చేసుకున్నాకే వారికి అనుమ‌తి వ‌స్తుంది.

ఇక ఈ పాస్‌లో వాహ‌న‌దారులు న‌మోదు చేసుకున్న వివ‌రాలు క్రాస్ చెక్ చేస్తారు. ఈ పాస్ కోసం అప్లై చేసుకోవాలంటే ముందుగా ఆధార్ నెంబ‌ర్‌తో పాటు అడ్ర‌స్ చెకింగ్ కూడా ఉంటుంది. ఇక ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల లోపు మాత్రమే ఏపీలోకి అనుమతిస్తారు. రాత్రి ఏడు దాటిన తర్వాత ఏపీ సరిహద్దుల్లోకి అనుమతించరు. ఒకవేళ.. అత్యవసరాల కోసం వెళ్లే వారిని మాత్రం కారణం తెలుసుకొని మాత్రమే అనుమతిస్తారు. ఈ నేప‌థ్యంలో ఏపీకి వెళ్లే వారు ఇష్ట‌మొచ్చిన‌ట్టు వెళితే తిప్ప‌లు త‌ప్ప‌వు.

అన్ లాక్ 3.0: ఈ ప‌ని చేయ‌క‌పోతే మీరు ఏపీ వెళ్ల‌లేరు… అడ్డంగా బుక్ అయిన‌ట్టే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts