వైరల్ వీడియో: అన్నాచెల్లెళ్ల డేంజర్ గేమ్…!

August 12, 2020 at 7:23 pm

ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో స్కూలుకు వెళ్లాల్సిన పాఠశాల విద్యార్థులు, అలాగే కళాశాలకు వెళ్లిన కాలేజ్ విద్యార్థులు పూర్తిగా ఇంటికి పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో కొన్ని పాఠశాలలు, కళాశాలలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. దీంతో పిల్లలకు ఇంట్లోనే ఉండటం పెద్ద బోర్ గా భావిస్తున్నారు. ఇలా రోజూ ఇంట్లోనే ఉండలేకపోతున్న ఓ ఇద్దరు అన్నాచెల్లెళ్లు సరదాగా ఓ పందెం పెట్టుకున్నారు. ఇందులో భాగంగా తన 14 ఏళ్ల చెల్లెలు వారు నివసిస్తున్న అపార్ట్మెంట్ లో ఏకంగా 23 వ అంతస్తులో బయట ఉన్న పిట్టగోడ పై ఏకంగా మూడుసార్లు ఆ అమ్మాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నడిచింది. ఒకవేళ ఎలాంటి పొరపాటు జరిగినా తన ప్రాణాలు గాల్లోనే కలిసి పోయేవి.

అయితే ఇలా నడుస్తున్న సమయంలో.. ఆ అపార్ట్మెంటు ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తి వీడియో తీసి దానిని కాస్త ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఇకపోతే సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన పోలీసులు ఈ వీడియోలో కనిపించిన అపార్ట్మెంట్ ఎక్కడ అని ఆరాతీయగా, చెన్నై నగరంలో శివారు ప్రాంతమైన కేలంబక్కం లోని ఓ అపార్ట్మెంట్ అని తేలింది. ఇలా అడ్రస్ తెలుసుకున్న పోలీసులు ఆ అపార్ట్మెంట్ దగ్గరికి చేరుకొని ఆ ఇద్దరి అన్నాచెల్లెళ్లకు మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఆ అపార్ట్మెంట్ యాజమాన్యానికి పోలీసులు అపార్ట్మెంట్ కు ఉన్న లెడ్జ్ ను మూసివేయాలని వారు హెచ్చరికలు జారీ చేశారు.

వైరల్ వీడియో: అన్నాచెల్లెళ్ల డేంజర్ గేమ్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts