వైఎస్‌ని సైతం మెప్పించిన ఆ టీడీపీ సీనియర్ సైలెంట్ ఎందుకో?

August 7, 2020 at 9:17 am

జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై ప్రతిపక్ష టీడీపీ నేతలు ఫుల్ ఫైర్ అవుతున్నారు. తాము అభివృద్ధి వికేంద్రీకరణ స్వాగతిస్తామని, కానీ అధికార వికేంద్రీకరణకు వ్యతిరేకమని మాట్లాడుతున్నారు. రాజధానిగా ఒక్క అమరావతినే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్నీ జిల్లాల్లోనే నేతలు ఇదే లైన్‌లో మాట్లాడుతున్నారు. కాకపోతే కొందరు రాయలసీమ, ఉత్తరాంధ్రకు జిల్లాలకు చెందిన నేతలు మాత్రం ఏమి మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటున్నారు.

అందులో ముఖ్యంగా టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ సైలెంట్‌గా ఆశ్చర్యపరుస్తుంది. అసలు మూడు దశాబ్దాల కాలం నుంచి టీడీపీకి అండగా ఉంటున్న కేశవ్ 2019 ఎన్నికల తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. 1994, 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన కేశవ్ పార్టీ కోసం గట్టిగానే కష్టపడ్డారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో సైతం ప్రతిపక్ష స్థానంలో ఉండి చంద్రబాబుకు మంచి సపోర్ట్ ఇచ్చారు. పి‌ఏ‌సి ఛైర్మన్‌గా పనిచేసి వైఎస్సార్ ప్రభుత్వం చేసిన తప్పులని సైతం ఎత్తిచూపేవారు.

ఒకానొక సమయంలో కేశవ్ పనితీరు చూసి వైఎస్సార్ సైతం ఆయన్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కానీ కేశవ్ మాత్రం టీడీపీని వదిలిపెట్టలేదు. ఇక 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా, కేశవ్ మాత్రం ఉరవకొండ నుంచి గెలవలేదు. అయితే 2019 ఎన్నికల్లో కేశవ్ గెలిస్తే, రాష్ట్రంలో మాత్రం టీడీపీ అధికారం కోల్పోయింది. అయినా ప్రతిపక్షంలో ఉంటూనే కేశవ్‌ పోరాడతారు అనుకుంటే, అసలు అడ్రెస్ ఉండటం లేదు. పి‌ఏ‌సి పదవి దక్కినా కూడా, కేశవ్, జగన్ ప్రభుత్వంపై పోరాటం చేయడం లేదు.

అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్‌లో తన పేరు రావడంతో ఒకసారి అసెంబ్లీలో గట్టిగానే మాట్లాడారు. కానీ తర్వాత నుంచి మాత్రం ప్రభుత్వంపై ఎక్కడా పోరాటం చేయలేదు. ప్రస్తుతం మూడు రాజధానులపై ఇంత రచ్చ జరుగుతున్నా కూడా కేశవ్ బయటకు రాలేదు. మరి ఇలా కేశవ్ సైలెంట్ అయిపోవడానికి అసలు కారణం ఏంటో?

వైఎస్‌ని సైతం మెప్పించిన ఆ టీడీపీ సీనియర్ సైలెంట్ ఎందుకో?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts