ఇదో విషాద ఘ‌ట‌న‌.. భ‌ర్త మ‌ర‌ణ వార్త విని భార్య కూడా మృతి!

August 23, 2020 at 10:13 am

నేటి కాలంలో భార్యభర్తలు చిన్నపాటి కార‌ణాల‌కే మనస్తాపానికి గురై.. విడాకుల వ‌ర‌కు వెళ్తున్నారు. ఆవేశంలో, కోపంలో చిన్న, చిన్న గొడవలకు కోర్ట్ మెట్లు ఎక్కుతున్న దంప‌తులు ఇటీవ‌ల భారీగా పెరుగిపోతున్నారు. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే దంప‌తులు గురించి వింటే.. క‌న్నీళ్లు ఆగ‌వేమో. ఆ దంప‌తులు ఎప్పుడూ క‌లిసుండేవారు.

Wife died after husband death, మ‌ర‌ణంలోనూ వీడ‌ని బంధం : భ‌ర్త మ‌ర‌ణ వార్త విని భార్య మృతి

ఎక్క‌డికి వెళ్లినా.. క‌లిసే వెళ్లేవారు. చివ‌ర‌కు మ‌ర‌ణంలోనూ వీరు బంధం వీడ‌లేదు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కొండంపేటలో డాక్టర్ సలాది రామారావు (75) ఆయ‌న భార్య నిర్మల (65) నివ‌సిస్తున్నారు. అయితే తాజాగా సలాది రామారావు గుండెపోటుతో మృతి చెందాడు.

ఈ విష‌యం తెలుసుకున్న భార్య నిర్మల సైతం త‌నువు చాలించింది. దీంతో మరణంలోనూ కూడా ఇద్దరూ ఒకర్ని ఒకరు విడిచి ఉండలేక వెళ్లిపోయారంటూ కుటుంబ సభ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

ఇదో విషాద ఘ‌ట‌న‌.. భ‌ర్త మ‌ర‌ణ వార్త విని భార్య కూడా మృతి!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts