ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సమాచారం.. పిల్లల ఆరోగ్యానికి కరోనా ముప్పు

August 14, 2020 at 4:42 pm

కరోనా మహమ్మారి వలన జన జీవనం స్తంభించిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు మూతపడ్డాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ప్రజలు ఎంతో నష్ట పోయారు. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో పిడుగులాంటి వార్త మోసుకొచ్చింది. కరోనా మహమ్మారి ఇతర అంటువ్యాధుల ముప్పు ఎక్కువగా పిల్లలకి ఎక్కువ ఉంది అని యూనిసెఫ్ జాయింట్ మానిటరింగ్ ప్రోగ్రాం (జేఎంపీ) గణాంకాలు తెలియజేస్తున్నాయి.ఈ నివేదికలో కీలక అంశాలు తెలిశాయి.దేశంలోని ప్రతీ మూడు పాఠశాలల్లో ఒక్క దాంట్లో మాత్రమే తాగునీరు, శానిటేషన్, పరిశుభ్రత వంటి సదుపాయాలు ఉన్నాయని, దీనివల్ల కరోనాతోపాటు, ఇతర అంటువ్యాధుల ముప్పు అధికంగా ఉందని నివేదిక తెలియజేసింది.

కరోనా నేపథ్యంలో పాఠశాలలను పూర్తి రక్షణ మధ్య తెరిచేందుకు పరిశుభ్రత అనేది కనీస అవసరమని ఈ నివేదిక అభిప్రాయపడింది. కరోనా కారణంగా 60 దేశాల్లో చిన్నారులు ఆరోగ్య పరంగా అత్యధిక ముప్పు ఎదుర్కొంటున్నట్టు నివేదిక పేర్కొంది.విద్యార్థులకు శానిటేషన్ సేవలు అందుబాటులో లేవని, ప్రపంచవ్యాప్తంగా ప్రతీ మూడు స్కూళ్లలో ఒక దానిలో మాత్రమే పరిమిత పూర్తిగా తాగునీటి సదుపాయం అందుబాటులో లేకుండా ఉంది అని ఈ నివేదిక వివరించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సమాచారం.. పిల్లల ఆరోగ్యానికి కరోనా ముప్పు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts