మీకు దండం పెడతా శానిటైజర్ తాగొద్దు, వైసీపీ ఎమ్మెల్యే విజ్ఞప్తి…!

August 8, 2020 at 10:34 am

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు శానిటైజర్ తాగి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కాస్త కంగారు పెడుతున్నాయి. ప్రకాశం జిల్లాలో దాదాపు 20 మంది వరకు ప్రాణాలు కోల్పోగా కడప జిల్లాలో కూడా 5 మంది వరకు మరణించారు. ఇక ఇప్పుడు ఇది తిరుపతి కి కూడా పాకింది. అది తాగి ప్రాణాలు కోల్పోతున్నా సరే ఈ విధంగా తాగడంతో చాలా మందిలో ఆందోళన వ్యక్తమవుతుంది.

తాజాగా తిరుపతిలో శానిటైజర్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. మత్తు కోసం శానిటైజర్ తాగి నలుగురు మృతి చెందడం బాధాకరమని భుమన కరుణాకర రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. తిరుపతి రూయా ఆసుపత్రి మార్చూరీ వద్ద శానిటైజర్ తాగి మృతి చెందిన స్కావెంజర్స్ కాలనీ వాసుల మృతదేహాలను ఆయన పరిశీలించారు. విషపూరితమైన శానిటైజర్ ను మత్తు కోసం తాగి యువత ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని ఆయన మందుబాబులకు సూచించారు.

మీకు దండం పెడతా శానిటైజర్ తాగొద్దు, వైసీపీ ఎమ్మెల్యే విజ్ఞప్తి…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts