వైసీపీ-టీడీపీల మధ్య ప్రేమ గొడవ…

August 13, 2020 at 11:46 am

నెల్లూరు జిల్లాలో ఓ ప్రేమ వ్యవహారం వైసీపీ-టీడీపీల మధ్య గొడవగా మారింది. నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట మండలం పులికాట్‌ తీర గ్రామం కొరిడికు చెందిన వెంకట రమణయ్యకు, అదే గ్రామానికి చెందిన ఓ యువతితో కొంతకాలంగా పరిచయం ఉంది. ఈ క్రమంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయం యువతి కుటుంబసభ్యులకు తెలియడంతో రమణయ్యను హెచ్చరించారు.

ఇక వారిద్దరిని కలుసుకోకుండా యువతి కుటుంబ సభ్యులు పకడ్బందీ చేశారు. అయినా సరే దూరం తట్టుకోలేని రమణయ్య…యువతికి ఫోన్ చేసి ఊరి చివరికి రప్పించాడు. వారు ఒక చెట్టు దగ్గర కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటుండగా యువతి కుటుంబ సభ్యులు హఠాత్తుగా వచ్చేసి, యువకుడుపై దాడికి పాల్పడ్డారు. యువతి సోదరుడు రమణయ్యపై కత్తితో దాడి చేశాడు. అలాగే యువతిని కొట్టి ఇంటికి తీసుకెళ్లిపోయారు.

రక్తమడుగులో ఉన్న రమణయ్యని గమనించిన స్థానికులు సూళ్ళూరుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో క్షతగాత్రుడు అరగంటకు పైగా నిరీక్షించిన సూళ్లూరుపేట పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదు. మరోవైపు బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి నెల్లూరు తరలించారు.

ఇక ఈ ఘటనకు రాజకీయం లింక్ అయింది. ఆ వూరులో కొన్నేళ్లు నుంచి టీడీపీ-వైసీపీ నాయకుల మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీకి సంబంధించిన యువతి కుటుంబ సభ్యులు టీడీపీకి చెందిన యువకుడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

వైసీపీ-టీడీపీల మధ్య ప్రేమ గొడవ…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts