త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ హ‌వా… రీజ‌న్ ఇదే..!

August 12, 2020 at 10:16 am

ప‌క్క‌నే ఉన్న త‌మిళ‌నాడులో మ‌రో ఆరు మాసాల్లో ఎన్నిక‌లు రానున్నాయి. అయితే, ఈ ఎన్నిక‌ల‌కు ఏపీ స‌ర్కారు అధినేత జ‌గ‌న్‌కు మ‌ధ్య లింకు ఉంది. ఈ ఎన్నిక‌లు జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పిగా మార‌నున్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి దీనికి కార‌ణ‌మేంటి? ప‌క్క‌రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగితే.. జ‌గ‌న్‌కు ఒరిగేదేంటి? ఎందుకు ఆయ‌న ఫీల్ అవ్వాల్సి ఉంది? ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌లు వైఎస్సార్ సీపీలో నే కాకుండా రాజ‌కీయ మేధావుల్లోనూ చ‌ర్చ‌గా మారాయి. విష‌యంలోకి వెళ్తే.. త‌మిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇక ఆరునెలల గడువు మాత్రమే ఉంది. దీంతో అన్ని పార్టీల్లోనూ అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది.

రాష్ట్రంలో కొన్నిపార్టీలు ప్రత్యక్షంగా, మరికొన్ని పార్టీలు పరోక్షంగా ఎన్నికలకు అప్పుడే సమాయుత్తం అవుతున్నాయి. వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన అన్నాడీఎంకే ముచ్చటగా మూడోసారి విజయకేతనం ఎగురవేయడం ద్వారా హ్యాట్రిక్‌ కొట్టాలని భావిస్తోంది. కానీ, దీనికి భిన్నంగా పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే ఈసారి ఎలాగైనా అధికార పీఠం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. త‌మిళ‌నాడులో సెంటిమెంటుకు బ‌లం ఎక్కువ‌. పైగా ఒక‌సారి అధికారం క‌ట్ట‌బెట్టిన పార్టీకి ఇక్క‌డి ప్ర‌జ‌లు వ‌రుస‌గా రెండోసారి అధికారం క‌ట్ట‌బెట్టే సంస్కృతి లేదు. అయిన‌ప్ప‌టికీ.. గ‌తంలో అన్నాడీఎంకేకు ఒకే ఒక్క‌సారి రెండోసారి కూడా అధికారం ఇచ్చారు.

అయితే, ఇప్పుడు మూడోసారి వ‌రుస‌గా అన్నాడీఎంకే అధికారంలోకి వ‌స్తుందా ? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఇదిలావుంటే, అధికార పీఠం కోసం పోరాడుతున్న రెండు పార్టీలు అన్నాడీఎంకే, డీఎంకేలు.. ఏపీ సీఎం జ‌గ‌న్‌ను అక్క‌డ ప్ర‌ధానంగా ప్రొజెక్టు చేస్తున్నాయి. మా వాడంటే.. మావాడంటూ. ఇరు పార్టీలు జ‌గ‌న్ బొమ్మ‌ను వాడుకుంటున్నాయి. నిజానికి డీఎంకే అధ్య‌క్షుడు స్టాలిన్ ఏకంగా జ‌గ‌న్ సీఎం గా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్పుడు వ‌చ్చి హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌తో జ‌గ‌న్‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక‌, అధికార అన్నాడీఎంకేతోనూ జ‌గ‌న్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో ఇరు ప‌క్షాలూ ఈయ‌న ప్ర‌చారాన్ని కోరుతున్నాయి. ఏపీ ప్ర‌జ‌లు ముఖ్యంగా తెలుగు వారు ఎక్కువ‌గా ఉంటే.. దాదాపు 50 నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌గ‌న్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు అయితే, జ‌గ‌న్ ఎవ‌రికి స‌పోర్టు చేయాల‌నే విష‌యంలో త‌ల ప‌ట్టుకుంటున్నార‌ట‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ హ‌వా… రీజ‌న్ ఇదే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts