జ‌గ‌న్ ఫ్యామిలీ సాధించిన రికార్డ్‌.. ఆ ఘ‌ట్టానికి ఏడేళ్లు పూర్తి…!!

August 8, 2020 at 12:31 pm

జ‌గ‌న‌న్న వ‌దిలిన బాణాన్ని.. అంటూ.. అనూహ్యంగా దూసుకువ‌చ్చిన వైఎస్ త‌న‌య ష‌ర్మిల పాద‌యాత్ర చేసి, ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రించిన విష‌యం గుర్తుందా? ఆ చారిత్ర‌క ఘ‌ట్టానికి ఏడేళ్లు ముగిశాయి. 2012 అక్టోబర్‌ 18న ఇడుపుల పాయ నుంచి మరోప్రజాప్రస్థానం పేరిట సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించారు ష‌ర్మిల‌. ఆ స‌మ‌యం నిజానికి వైఎస్సార్ సీపీకి ఒక అగ్నిప‌రీక్ష‌. ఒక‌వైపు జ‌గ‌న్ కొన్ని అక్ర‌మ కేసుల్లో జైలుపాలు కావ‌డం, ఇక‌, పార్టీని ఎవరు ర‌క్షిస్తార‌నే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం. మ‌రోప‌క్క‌, వైఎస్ పెంచి, పోషించిన కాంగ్రెస్ పార్టీనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తుదికంటా అంత‌మొందించాల‌ని నిర్ణ‌యించ‌డం వంటి కుట్ర‌లు సాగుతున్న స‌మ‌యం.

ఆ స‌మ‌యంలో రోడ్డు మీద‌కు వ‌చ్చిన ష‌ర్మిల‌.. నేను జ‌గ‌న‌న్న వ‌దిలిన బాణాన్ని అని నిన‌దిస్తూ.. ప్ర‌తి గుండెను త‌ట్టారు. నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలతో మమేకమై వారి కష్టాలను తెలుసుకుంటూ, కన్నీళ్లు తుడుస్తూ పాదయాత్ర కొనసాగించారు. అప్పటి రాష్ట్రంలో 14 జిల్లాలు, 116 నియోజకవర్గాల గుండా 230 రోజుల పాటు 3112 కిలోమీటర్ల పాదయాత్రను కొనసాగించి 2013 ఆగస్టు 4 వ తేదీన ఇచ్ఛాపురంలో ముగించారు. అన్నకిచ్చిన మాటకోసం ప్రజల శ్రేయస్సును కోరి ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి సారిగా సుదీర్ఘ పాదయాత్రను పూర్తి చేసిన మహిళగా చరిత్ర పుటల్లో పేరు లిఖించుకున్నారు. నేటి వైఎస్సార్‌సీపీ అఖండ విజయానికి అప్పుడే బలమైన పునాదులు వేశారు.

ఆ పాదయాత్రను ముగింపునకు గుర్తుగా ఇచ్ఛాపురం పట్టణంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానానికి ఆనుకొని మరోప్రజాప్రస్థానం పేరిట విజయ స్థూపం ఏర్పాటు చేశారు. ఒక మహిళ వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయడమనేది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. వైఎస్‌ షరి్మల అప్పడు పాదయాత్ర ద్వారా నాటి న విత్తనమే ఇప్పుడు మహావృక్షంగా ఈ స్థాయి లో ఉంది. వైఎస్‌ రాజశేఖర రెడ్డి, షర్మిల, వైఎస్‌ జగన్‌ అందరూ ఇచ్ఛాపురంలోనే పాదయాత్ర ముగించారు. ఆ కుటుంబంతో ఇచ్ఛాపురానికి విడదీయలేని అనుబంధం ఉంద‌న‌డంలో సందేహం లేదు. ఇదే వైఎస్ జ‌గ‌న్ ఫ్యామిలీలో పెద్ద రికార్డుగా పేర్కొంటున్నారు ప‌రిశీల‌కులు.

జ‌గ‌న్ ఫ్యామిలీ సాధించిన రికార్డ్‌.. ఆ ఘ‌ట్టానికి ఏడేళ్లు పూర్తి…!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts