కృష్ణా-గుంటూరుల్లో జ‌గ‌న్ ‘ క‌మ్మ ‘ ని ప్రేమ‌..!

August 5, 2020 at 8:12 am

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చెప్ప‌డం క‌ష్టం. ఇప్పుడు కూడా ఏపీలో రాజ‌కీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఎవ‌రూ ఊహించని విధంగా అమ‌రావ‌తిని మార్పు చేస్తున్నారు. దీంతో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు ఉవ్వెత్తున విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. స‌రే! ఈ విమ‌ర్శ‌ల‌కు ప్ర‌తివిమ‌ర్శ‌లు చేయొచ్చు. కానీ, ప్ర‌జ‌ల‌ను ముఖ్యంగా అధికార పార్టీ త‌మ‌కు వ్య‌తిరేకంగా ఉన్న‌ద‌నే భావంతో ఉన్న క‌మ్మ రాజ‌కీయ నేత‌లు, ఈ సామాజిక వ‌ర్గం ప్ర‌జ‌ల‌ను సంతృప్తి ప‌ర‌చాల్సిన అవ‌స‌రం ఇప్పుడు జ‌గ‌న్‌పై ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ వ‌ర్గానికి ప్రాదాన్యం పెంచ‌డం ద్వారా ఆయ‌న ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించారు.

రాజ‌ధాని ఎఫెక్ట్ ఎక్కువ‌గా ఉండే.. గుంటూరు, కృష్ణాజిల్లాల్లో టీడీపీకి క‌మ్మ‌సామ్రాజ్యం ఎక్కువ‌గా ఉంది. ఇదే స‌మ‌యంలో వైఎస్సార్ సీపీలోనూ ఈ నేత‌లు ఉన్న‌ప్ప‌టికీ.. బ‌ల‌మైన ప్రాతినిధ్యం మాత్రం క‌నిపించ‌డం లేదు. నేత‌లు ఉన్న‌ప్ప‌టికీ.. పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించ‌డం లేదు. దీంతో కొత్త‌వారికి ప్రాధాన్యం ఇవ్వ‌డంతోపాటు.. క‌మ్మ‌వ‌ర్గానికి ప‌ద‌వులు ఇవ్వాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్టు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు ఎలాంటి ప‌ద‌వులు లేవ‌ని భావిస్తున్న వైఎఎస్సార్ సీపీలోని క‌మ్మ‌నాయ‌కుల‌కు ప‌ద‌వులు ఇవ్వ‌డంద్వారా వారిని రీచార్జ్ చేసి.. జ‌నంలోకి వ‌ద‌లాలని భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ప్రాంతీయ మండ‌ళ్లు స‌హా నామినేటెడ్ ప‌ద‌వుల్లోనూ వీరికి బ‌ల‌మైన ప్రాతినిధ్యం ద‌క్క‌నుంద‌ని అంటున్నారు. కొన్ని కార‌ణాల‌తో ఈ క‌మ్మ ‌సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు గ‌త ఏడాది ఎన్నిక‌ల నుంచి సైలెంట్ గా ఉంటున్నారు. ఈ ప‌రిణామాల‌తో పార్టీపై ఎవ‌రైనా విరుచుకుప‌డినా.. స్పందించే నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. దీంతో ప్ర‌భుత్వం తీసుకు వ‌స్తున్న కార్య‌క్ర‌మాల నుంచి ప్ర‌తిప‌క్షాల‌కు కౌంట‌ర్ ఇచ్చే వ‌ర‌కు కూడా ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. ఈ విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న జ‌గ‌న్‌.. ఈ రెండు జిల్లాల్లోనూ క‌మ్మ‌ల‌కు ఎక్కువ‌గా అవ‌కాశం ఇచ్చి.. పార్టీ పునాదులు ప‌టిష్టం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెబుతున్నారు.

ఈ లిస్టులో చిల‌క‌లూరిపేట మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియ‌ర్ నేత మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, గుంటూరు జిల్లాకే చెందిన మాజీ ఎమ్మెల్యే రావి వెంక‌ట‌ర‌మ‌ణ‌, కృష్ణా జిల్లా నుంచి దేవినేని అవినాష్‌, బొప్ప‌న భ‌వ‌కుమార్‌తో పాటు య‌ల‌మంచిలి ర‌వి మ‌రికొంద‌రు నేత‌లు ఉన్నార‌ట‌. వీరిలో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు జ‌గ‌న్ ఎమ్మెల్సీతో పాటు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

కృష్ణా-గుంటూరుల్లో జ‌గ‌న్ ‘ క‌మ్మ ‘ ని ప్రేమ‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts