పార్టీలో చేర‌క‌ముందే.. గంటాకు షాక్ ఇచ్చిన వైసీపీ నేత‌లు!!

August 6, 2020 at 2:39 pm

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ చేప్టటిన ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు వైసీపీ ఖండువ క‌ప్పుకున్నారు. ఇక విశాఖకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా త్వ‌రంలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నార‌ని వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. దీనికి ఇప్పటికే లైన్ క్లియర్ అయిపోయింది. ముహూర్తం కూడా సిద్ధమైంది.

వాస్త‌వానికి ఎప్ప‌టినుంచో వైసీపీలో గంటా చేరబోతున్నారనే ప్రచారం జ‌రుగుతోంది. అయితే ఇటీవ‌ల గంటా అధికార పార్టీలో చేరేందుకు ముహుర్తం ఖరారు అయింది. ఈ క్ర‌మంలోనే మొద‌ట ఆగస్ట్ 15వ తేదీన వైసీపీ కండువా కప్పుకోబోతున్నారంటూ ప్రచారం జరిగినా… తాజాగా 16వ తేదీని ఫిక్స్ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమక్షంలో గంటా వైసీపీలో చేరనున్నారు. అదే జరిగితే విశాఖ రాజకీయాల్లో వైసీపీ హవా మొదలు కావడానికి ఈ చేరిక కీలకం కానుంది.

అయితే గంటా పార్టీలో చేర‌క ముందు.. వైసీపీ నేత‌లు షాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా విశాఖకు చెందిన కొందరు నేతలు ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారు. వారిలో మంత్రి అవంతి శ్రీనివాస్ బహిరంగంగానే గంటాను టార్గెట్ చేశారు.. ఆయన చేరిక సంగతి మాత్రం అధిష్టానం చూసుకుంటుంది అనేశారు. అలాగే భీమిలి నియోజకవర్గంలో పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. పీఎం పాలెం, చిన్నాపురం , తగరపువలస జంక్షన్‌లలో నిరసనలు జరిగాయి. గంటా శ్రీనివాసరావును వైసీపీలోకి తీసుకోవద్దంటూ కొంద‌రు నేత‌లు నిరసనకారులు నినాదాలు చేశారు. దీంతో గంటా వైసీపీలో చేరాతారా.. లేదా.. అన్న‌ది మ‌ళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.

పార్టీలో చేర‌క‌ముందే.. గంటాకు షాక్ ఇచ్చిన వైసీపీ నేత‌లు!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts