క‌రోనా టెర్ర‌ర్‌.. వైసీపీలో మ‌రో ఎమ్మెల్యేకు పాజిటివ్‌!!

August 7, 2020 at 8:17 am

క‌రోనా వైర‌స్‌.. ఈ పేరు వింటేనే ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వ్యాక్సిన్ లేని ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. చైనాలో పుట్టి ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌ను అల్ల‌క‌ల్లోం చేస్తోంది. ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లితీసుకున్న క‌రోనా.. ఇంకెంత‌మందిని పొట్ట‌న‌పెట్టుకుంటుందో అర్థంకావ‌డం లేదు. సామాన్యుల నుంచి రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు అందరూ కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.

ముఖ్యంగా ఏపీలో క‌రోనా బారిన ప‌డిన‌ రాజకీయ నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా మ‌రో వైసీపీ ఎమ్మెల్యేకు క‌రోనా సోకింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన టెస్టులు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది.

ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్న ఆయన.. డాక్టర్ల పర్యవేక్షణలో ఇంటి దగ్గర నుంచే చికిత్స తీసుకుంటున్నారు. కాగా, ఇప్ప‌టికే ఏపీలో డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో పాటు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సహా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా సోకిన విష‌యం తెలిసిందే.

క‌రోనా టెర్ర‌ర్‌.. వైసీపీలో మ‌రో ఎమ్మెల్యేకు పాజిటివ్‌!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts