చిక్కుల్లో వైసీపీ ఎమ్మెల్సీ…

August 13, 2020 at 11:54 am

కోర్టులు, న్యాయవాదులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే రవీంద్రబాబుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి న్యాయవాది లక్ష్మీనారాయణ లేఖ రాశారు. కోర్టును, న్యాయమూర్తులను ఉద్దేశించి రవీంద్రబాబు ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థపై దాడి చేయడమేనని న్యాయవాది లక్ష్మీనారాయణ లేఖలో పేర్కొన్నారు.

అయితే తాజాగా లక్ష్మీనారాయణ మెయిల్ ద్వారా రాష్ట్రపతి, గవర్నర్‌కు.. కోర్టును, లాయర్లను ఉద్దేశించి రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. నేరుగా ఫిర్యాదు చేసేందుకు గవర్నర్ అనుమతిని లక్ష్మీనారాయణ కోరారు. రవీంద్రబాబును ఎమ్మెల్సీగా అనర్హుడిగా ప్రకటించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా, ఇటీవల పండుల రాజధాని రైతుల పోరాటాన్ని అవహేళన చేయడమే కాకుండా న్యాయమూర్తులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, జడ్జీలు, కేసులు, సీఎం జగన్ వెంట్రుక కూడా కదపలేరని పండుల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పండులకు సీఎం జగన్ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.

చిక్కుల్లో వైసీపీ ఎమ్మెల్సీ…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts