టీడీపీ కంచుకోటలో జగన్ కొత్త కాన్సెప్ట్..

August 8, 2020 at 9:31 am

రాయలసీమలో ఉన్న నాలుగు జిల్లాలో టీడీపీకి కంచుకోటగా ఉన్న జిల్లా ఏదంటే? ఠక్కున అనంతపురం పేరు చెప్పేయొచ్చు. పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి అనంతపురం జిల్లాలో టీడీపీకి మంచి పట్టుంది. మిగతా మూడు జిల్లాల్లో పెద్ద పట్టు లేకపోయినా సరే అనంతలో మాత్రం టీడీపీకి తిరుగులేదు. 2014 ఎన్నికల్లో సైతం ఈ విషయమే రుజువైంది. జిల్లాలో మొత్తం 14 సీట్లకు గాను టీడీపీ 12 గెలుచుకుంటే, వైసీపీ 2 గెలుచుకుంది.

అయితే 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో టీడీపీ చతికిలపడింది. వైసీపీ 12 సీట్లు గెలుచుకుంటే, టీడీపీ 2 చోట్ల విజయం సాధించింది. అలా అని అనంతలో టీడీపీ బలం పూర్తిగా ఏమీ తగ్గలేదు. జిల్లాలో టీడీపీ కేడర్ ఇంకా బలంగానే ఉంది. ఆ బలంతోనే టీడీపీ ఇప్పుడు నిదానంగా పుంజుకుంటుంది. ఇక టీడీపీని పుంజుకోకుండా చేసేందుకు జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు.

రాయలసీమలో జ్యుడీషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయనుండటం, ఆ నిర్ణయాన్ని చంద్రబాబు వ్యతిరేకించడం వల్ల సీమలో టీడీపీకి ఇబ్బందులు మొదలయ్యాయి. అయితే హైకోర్టు కర్నూలులో కాబట్టి అనంతపురంలో టీడీపీకి పెద్దగా ఇబ్బందులు రావని తమ్ముళ్ళు అనుకున్నారు. కానీ ఊహించని విధంగా జగన్ కంచుకోటలో టీడీపీని దెబ్బకొట్టేందుకు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు.

రాష్ట్రంలో కాన్సెప్ట్‌ నగరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, అందుకు సంబంధించిన కార్యాచరణను ప్రారంభించింది. ఇక కాన్సెప్ట్ సిటీ అంటే…ఒకేచోట వాణిజ్య, నివాస, ఇతర అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు చేయడం. రాష్ట్రంలో అనంతపురం, తిరుపతి, విశాఖపట్నంలో కాన్సెప్ట్‌ సిటీలను ఏర్పాటుచేస్తారు. అయితే ఇందులో విశాఖ, తిరుపతిలు అనంతపురం కంటే అభివృద్ధి చెందిన నగరాలు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ సిటీ వల్ల అనంతపురం జిల్లా అభివృద్ధి పథంలో నడవనుంది. ఈ నాలుగేళ్లలో కాన్సెప్ట్ సిటీ పూర్తి అయితే జిల్లాలో వైసీపీకి తిరుగుండదు. దీంతో ఇక్కడ టీడీపీకి మళ్ళీ చెక్ పడొచ్చు.

టీడీపీ కంచుకోటలో జగన్ కొత్త కాన్సెప్ట్..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts