మెగాస్టార్‌తో ఫిదా భామా..?

September 11, 2020 at 8:02 am

మెగాస్టార్ చిరంజీవీతో క‌లిసి న‌టించాల‌ని కోరుకోని వారు ఎవ‌రూ ఉండ‌రు. ఆ అవ‌కాశం వ‌స్తుందా? అని ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు అలాంటి అవ‌కాశం కుర్ర హీరోయిన్ త‌లుపు త‌ట్టింద‌ని టాలివుడ్ వ‌ర్గాల స‌మాచారం. వివ‌రాల్లోకి వెళ్లితే.. అగ్ర క‌థానాయ‌కుడు ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ చిత్ర షూటింగ్ పూర్త‌యిన త‌రువాత ఆయ‌న మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ సినిమా వేదాళం రీమేక్‌లో న‌టించ‌నున్నారు. సిస్ట‌ర్ సెంటిమెంటే ఈ చిత్రక‌థ‌లో కీల‌కం.

త‌మిళ మాతృక‌లో ఈ సినిమాలో అజిత్ న‌టించ‌గా, ఆయ‌నకు సోద‌రిగా ల‌క్ష్మీమీన‌న్ న‌టించింది. అయితే తెలుగులో చిరంజీవికి చెల్లికి ఎవ‌రు న‌టిస్తారా? అనే చ‌ర్చ జోరుగా కొన‌సాగుతున్న‌ది తెలుగు సినీ అభిమానుల్లో. తాజాగా టాలివుడ్ వ‌ర్గాల ద్వారా తెలుస్తున్న స‌మాచారం ప్ర‌కారం ఆ అవ‌కాశం సాయిప‌ల్ల‌వికి ద‌క్కే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తున్న‌ది. సినిమా ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆమె పేరును ప్ర‌ముఖంగా ప‌రిశీలిస్తున్నార‌ట‌. అగ్ర‌క‌థానాయ‌కుడు కావ‌డం, ముఖ్య‌మైన పాత్ర కావ‌డంతో సాయిప‌ల్ల‌వి కూడా ఈ అంశంపై ఆస‌క్తి చూపుతున్న‌ద‌ట‌. ప్ర‌స్తుతం ఈ ఫిదా పోరి నాగ‌చైత‌న్య స‌ర‌స‌న ల‌వ్‌స్టోరీ సినిమాలో న‌టిస్తున్న‌ది.

మెగాస్టార్‌తో ఫిదా భామా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts