సొంత జిల్లాలో బాబుకు అదిరిపోయే షాక్…వైసీపీలోకి కీలక నేత?  

September 24, 2020 at 11:21 am

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష టీడీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు వైసీపీలోకి జంప్ కొడుతున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు కండువా మార్చేశారు. ఇటీవల విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ సైతం జగన్‌కు జై కొట్టారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు మరోషాక్ తగలనుందని తెలుస్తోంది.

బాబు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులనాయుడు ఫ్యామిలీ వైసీపీ వెళ్ళేందుకు సిద్ధమవుతుందని సమాచారం. తాజాగా తిరుమలలో ఉన్న జగన్‌తో ఆదికేశవులనాయుడు కుమారుడు శ్రీనివాసులు భేటీ అయ్యారు. రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి…శ్రీనివాస్‌ను సీఎంకు పరిచయం చేశారు. జగన్‌తో 10 నిముషాల పాటు శ్రీనివాసులు భేటీ అయ్యారు. శ్రీనివాస్ తల్లి డి.కె.సత్యప్రభ గత లోకసభ ఎన్నికల్లో రాజంపేటలో మిధున్ రెడ్డికి ప్రత్యర్థిగా టీడీపీ నుంచి బరిలో దిగి ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఓటమి పాలైన దగ్గర నుంచి సత్యప్రభ పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఇక  జగన్‌తో భేటీ నేపథ్యంలో త్వరలోనే శ్రీనివాసులు వైసీపీలో చేరే అవకాశం ఉంది. అయితే సత్యప్రభ కూడా వైసీపీలో చేరనున్నారని తెలుస్తోంది.

సొంత జిల్లాలో బాబుకు అదిరిపోయే షాక్…వైసీపీలోకి కీలక నేత?  
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts