108 వాహ‌నానికి నిప్పుపెట్టిన రౌడీషీట‌ర్‌

September 16, 2020 at 8:52 pm

ఆప‌ద స‌మ‌యంలో ఒక్క ఫోన్ చేయ‌గానే ర‌య్యిమంటూ దూసుకొచ్చి క్ష‌ణాల్లో వైద్య‌శాల‌కు త‌ర‌లించి ఎంతో మంది ప్రాణాల‌ను కాపాడుతున్న‌ది 108 వాహ‌నం. కానీ ఓ రౌడిషీట‌ర్ ఏకంగా ఆ వాహ‌నాన్నే ద‌హ‌నం చేశాడు. నానా హంగామా చేశాడు. ఈ సంఘ‌ట‌న ప్ర‌కాశం జిల్లా ఒంగోలులో జ‌రిగింది. పోలీసులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. ఒంగోలుకు చెందిన రౌడీషీట‌ర్ సురేశ్ కొన్ని రోజులుగా 108కు ప‌దే ప‌దే ఫోన్లు చేస్తున్నాడు. అంతేకాకుండా ఏకంగా పోలీస్ స్టేష‌న్‌కే వెళ్లి త‌న‌ను అరెస్టు చేయాలంటూ పిచ్చిపిచ్చిగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడు.

ఈ నేప‌థ్యంలోనే బుధ‌వారం సైతం ఠాణాకు వెళ్లి నానా హంగామా చేశాడు. ఠాణా త‌లుపుల‌ను ప‌గ‌ల‌గొట్టాడు. ఈ క్ర‌మంలో సురేష్‌కు గాయాల‌య్యాయి. దీంతో ‌పోలీసులు వెంట‌నే 108కు స‌మాచారం ఇవ్వ‌గా సిబ్బంది హుటాహుటిన అక్క‌డికి చేరుకున్నారు. సురేష్‌ను వాహ‌నంలోకి ఎక్కించ‌గా అందులోనూ నానా హంగామా చేశాడు. వాహ‌నంలోని ఫ‌ర్నీచ‌ర్ ను ధ్వంసం చేశాడు. అక్క‌డితో ఆగ‌కుండా స్పిరిట్‌ను పోసీ వాహ‌నానికి నిప్పుపెట్టి ప‌రార‌య్యాడు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. సురేశ్ కోసం గాలింపు చేప‌ట్టారు. అయితే అత‌ని మాన‌సిక ప‌రిస్థితి స‌రిగా లేద‌ని పోలీసులు భావిస్తున్నారు.

108 వాహ‌నానికి నిప్పుపెట్టిన రౌడీషీట‌ర్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts