బ‌ధిరుల‌కు 4జీ స్మార్ట్ ఫోన్లు..!

September 16, 2020 at 8:10 pm

కోవిడ్ 19 దృష్ట్యా, కరోన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు కొన‌సాగుతున్నవిష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆశ్రమ పాఠశాలల్లో 8,9,10తరగతులచదువుతున్న సుమారు 250 మంది బధిర, అంధ విద్యార్థులకు తరగతుల బోధనకు తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో బదిరులకు 4జి స్మార్ట్ సెల్ ఫోన్స్ పంపిణీ చేయ‌నున్నారు. అందులో భాగంగా ఈ రోజు కొంత మంది విద్యార్థులకు వికలాంగుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ , రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దివ్యంగులకు ఆసరా పథకం ద్వారా 3016 పింఛ‌న్‌ను అందిస్తున్నార‌ని కొనియాడారు. ఈ రోజు వికలాంగుల సహకార సంస్థ ద్వారా ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బదిరులకు 4జి స్మార్ట్ సెల్ ఫోన్స్ అందిచడంపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అనంతరం కార్పొరేషన్ చైర్మన్ డా.కే.వాసుదేవరెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మనసున్న నాయకుడు కాబట్టే దివ్యంగుల సంక్షేమనికి అనేక నిధులను, కేటాయిస్తున్నార‌ని కొనియాడారు. కరోనా సమయంలో కూడా దివ్యంగులకు ఇచ్చే పెన్షన్లు అపకుండా నెలకు దాదాపు 5లక్షల మందికి రూ.150 కోట్లు, ప్రతి సం.రము దాదాపు 1800 కోట్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం, నాయకుడు ఒక్క కేసీఆర్ మాత్రమేన‌ని శ్లాఘించారు. బదిరులకు వీడియో,ఆడియో, సైన్ బాషా ద్వారా తరగతుల బోధన కోసం 4జి స్మార్ట్ సెల్ ఫోన్స్ ను వివ‌రించారు. ఆన్ లైన్ బోధన కోసం మాత్రమే ఫోన్ల‌ను ఉపయోగించాలని,తల్లి తండ్రులు విద్యార్థుల‌ను నిత్యం ప‌ర్య‌వేక్షించాల‌ని సూచించారు.

బ‌ధిరుల‌కు 4జీ స్మార్ట్ ఫోన్లు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts