బిగ్ బాస్‌4: నామినేషన్‌లో ఆ ఏడుగురు.. చెలరేగిపోయిన అఖిల్‌?

September 29, 2020 at 8:21 am

బిగ్ బాస్ సీజ‌న్ 4 మూడు వారాలు పూర్తి చేసుకుని.. నాల్గువ వారంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇక సోమవారం నాడు నాలుగో వారం నామినేషన్స్ ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ వారం నామినేష‌న్స్ స‌రికొత్త‌గా ప్లాన్ చేశాడు బిగ్ బాస్‌. ఈవారం నామినేషన్స్‌లో భాగంగా సొహైల్-అఖిల్‌ ఇద్దరూ హిట్ మెన్‌లుగా ఉంటారని.. ఈ ఇద్దరికీ ఒక డెన్ ఉంటుంది. బజర్ మోగినప్పుడల్లా మిగిలిన ఇంటి స‌భ్యులు డెన్‌లోకి పరుగెత్తుకెళ్లాలని బిగ్‌బాస్ తెలిపారు.

మొదట ఎవరు పరిగెడితే వాళ్లకు మరొకరిని నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుందని.. ఇలా మొదటి ఐదుగురికి ఈ అవకాశం ఉంటుందని తెలిపారు. ఇక ఇంటి స‌భ్యులు ఎవ‌రి పేరు చెబితే.. సొహైల్-అఖిల్ వారిని షూట్ చేయాల్సి ఉంటుంది. మర్డర్ చేసిన వారికి నామినేట్ చేసిన కంటెస్టెంట్ రూ.10 వేలు ఇస్తారు. అయితే మొదటగా డెన్‌లోకి వ‌చ్చిన అమ్మ రాజశేఖర్ మాస్టర్.. స్వాతిని నామినేట్ చేస్తున్నట్లు తెలిపారు. ఆ త‌ర్వాత మెహబూబ్ వెళ్లి.. అభిజిత్‌ని, అరియానా గ్లోరి.. లాస్యను, హారిక..మెహబూబ్‌ని, సుజాత.. కుమార్ సాయిని నామినేట్ చేశారు.

Bigg Boss Telugu: 7 members in the nominations for the fourth week

అయితే నామినేషన్లు చేసే సమయంలో అఖిల్‌ వరుసగా నాలుగు మర్డర్లు చేసి చెలరేగిపోయారు. ఇక సొహైల్‌ ఒకరిని మాత్రమే మర్డర్ చేయగలిగారు. దీంతో అఖిల్‌కు ఎక్కువ డ‌బ్బులు రావ‌డం.. సొహైల్ నామినేట్ అవ్వ‌డం జ‌రిగింది. అలాగే అఖిల్ ద‌గ్గ‌ర ఎక్కువ డ‌బ్బు ఉండ‌టంతో.. బిగ్ బాస్ అత‌డికి ఒకర్ని నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే అఖిల్‌ను.. హారిక‌ను నామినేట్ చేశాడు. ఇక ఈ వారం నామినేష‌న్స్‌లో హారిక‌, అభిజిత్‌, లాస్య‌, స్వాతి, కుమార్ సాయి, మెహ‌బూబ్ మ‌రియు సోహెల్ నామినేష‌న్స్‌లో ఉన్నారు. మ‌రి వీరిలో ఈ వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

బిగ్ బాస్‌4: నామినేషన్‌లో ఆ ఏడుగురు.. చెలరేగిపోయిన అఖిల్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts