డ్రైవ‌ర్ లేకుండానే దూసుకెళ్తున్న కారు..!

September 30, 2020 at 4:20 pm
Tesla_car

టెస్లా కార్ల గురించి తెలియని వారుండరూ.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లలో టెస్లా కంపెనీ కార్లు కూడా ఉంటాయి. అత్యాధునిక టెక్నాలజీని కలిగిన ఈ కార్లను చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. లగ్జరీ అందాలతో.. అత్యాధునిక టెక్నాలజీతో తయారై స్టైలిష్ గా కనిపిస్తుంటారు. టెస్లా కార్లను కొనుగోలు చేయాలని చాలా మంది ఆశ పడుతుంటారు. అయితే టెస్లాకు చెందిన ఓ కారును కొనుగోలు చేసిన వ్యక్తి డ్రైవింగ్ సమయంలో తాను తీసిన వీడియో ప్రస్తుతం వైరల్ అయింది.

టెస్లాకు చెందిన కారులో ఆటో పైలట్ ఫీచర్ ను కంట్రోల్ చేస్తూ నార్త్ కరోలినాలోని ఓ రహదారిపై ప్రయాణించాడు. ప్రయాణికుల సీట్లో యజామని కూర్చోని డ్రైవర్ సీట్ లో ఎవరూ లేకుండా హైవే పరిగెత్తించాడు. వీడియోని చూసినట్లయితే యాజమాని ప్యాసింజర్ సీట్లో హాయిగా కూర్చొని సేదతీరుతూ కూర్చుంటాడు. హైవే మీద పక్కనే వాహనాలు దూసుకుపోతుంటాయి. యజమాని వీడియోను డ్రైవర్ సీటుపై తీసుకెళ్లినప్పుడు సీటు మీద ఎవరూ ఉండరూ.. టెస్లా తమ కార్లలో ఆటో పైలట్ ఫీచర్ ను ఉపయోగించింది. ప్రస్తుతం ఆ కారు ఆటో పైలట్ ఫీచర్ కు యాక్టివ్ డ్రైవర్ పర్యవేక్షణ అవసరం అని టెస్లా కంపెనీ పేర్కొంది.

డ్రైవ‌ర్ లేకుండానే దూసుకెళ్తున్న కారు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts