ఆ హీరోతో నేను ఎప్పుడూ సిద్ధమే అంటున్న హాట్ హీరోయిన్..?

September 24, 2020 at 7:01 pm

దాదాపు దశాబ్ద కాలానికి పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా తన హవా నడిపించి తన అందచందాలతో.. తన చిలిపి చిరునవ్వుతో… తన గొప్ప నటనతో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది శ్రీయ. యువ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు అందరితో జోడి కట్టి అదరగొట్టింది ఈ ముద్దుగుమ్మ . పెళ్లయిన తర్వాత కొన్నాళ్లు వరకు సినిమాలకు అందాల ఆరబోతకు దూరంగానే ఉన్నప్పటికీ.. సోషల్ మీడియా వేదికగా తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకుల మతి పోగొడుతుంది.

ప్రస్తుతం మంచి స్క్రిప్ట్ ఉంటే సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకుంది. తాను చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చాను అంటూ తెలిపిన శ్రీయ.. సంతోషం సినిమాలో నా వయసు చాలా తక్కువ అంటూ చెప్పింది. నాగార్జునతో నటించేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను చెప్పుకొచ్చింది శ్రీయ. కాగా ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

ఆ హీరోతో నేను ఎప్పుడూ సిద్ధమే అంటున్న హాట్ హీరోయిన్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts