షార్క్‌ నుంచి భర్త ప్రాణాలను కాపాడుకున్న గర్భణి మహిళ..!

September 24, 2020 at 8:07 pm

భర్త ప్రాణాల కోసం షార్క్ తో పోరాడింది అతని భార్య. ఈ అరుదైన ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది చోటు చేసుకుంది. స్నార్కెలింగ్‌ యాత్ర చేస్తున్న ఓ కుటుంబంలోని ఒకరు షార్క్‌కు చిక్కాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా గట్టిగా కేకలు మొదలెట్టారు. అతడి భార్య గర్భిణి. భర్త రక్తం మరకలు చూసి, ఒక్క ఉదుటన నీళ్లలో దూకింది ఆమె. ఇక షార్క్ ‌నుంచి భర్త ప్రాణాలు కాపాడుకున్నది. సాహస మహిళగా గుర్తింపు పొందింది ఆమె.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సెప్టెంబర్ 20 న మార్గోట్ డ్యూక్స్ ఎడ్డీ, తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, భర్త ఆండ్రూ ఎడ్డీతో కలిసి పడవలో వెళ్తున్నారు. కానీ, అకస్మాత్తుగా ఆండ్రూ పడవ నుంచి జారిపోయి నీటిలో పడిపోయాడు. ఇక అతను ఒక పెద్ద సొరచేపకు చిక్కాడు. అతడి రక్తం నీటిపై తేలగా, ఏమాత్రం ఆలోచించకుండా డ్యూక్స్‌ నీటిలోకి దూకేసింది. ఇతర కుటుంబ సభ్యుల సహాయంతో భర్తను షార్క్ ‌నుంచి కాపాడుకుంది. అనంతరం ఆండ్రూను సోంబ్రెరో బీచ్‌కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అతడికి చికిత్స అందించారు. మయామిలోని జాక్సన్ మెమోరియల్ హాస్పిటల్‌లో చేర్పించారు. కాగా, తెగువచూపి భర్తను కాపాడుకున్న డ్యూక్స్‌ను అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

షార్క్‌ నుంచి భర్త ప్రాణాలను కాపాడుకున్న గర్భణి మహిళ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts