ఆ విషయాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఏపీ మంత్రి.!

September 21, 2020 at 3:54 pm

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరితో కలిసి కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో బేటీ అయ్యారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ప్రస్తుతం ఈ భేటీ ఆంధ్ర రాజకీయాల్లో ఆసక్తిని సంతరించుకుంది . ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన పలు ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను కేంద్రం దృష్టికి మంత్రి అనిల్ కుమార్ తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు వివరాలను కూడా కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కి వివరించినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా పోలవరం బకాయిలను… పునరావాస ప్యాకేజీ నిధులను విడుదల చేయాలి అంటూ ఈ భేటీలో ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ను కోరినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో తమ ప్రభుత్వం ఎంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని… 2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అంటూ కేంద్ర మంత్రికి వివరించారు అనిల్ కుమార్ యాదవ్. అంతేకాదు కృష్ణానదిపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులతో రాయలసీమ ప్రజలందరికీ చేకూరే ప్రయోజనాలను గురించి కూడా కేంద్ర మంత్రి వివరించినట్లు తెలుస్తోంది.

ఆ విషయాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఏపీ మంత్రి.!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts