ఒక్క చేపతో రాత్రికి రాత్రి లక్షాధికారి..!

September 30, 2020 at 8:12 pm

పశ్చిమ బెంగాల్‌లో ఓ ముసలామె రాత్రికి రాత్రి లక్షాధికారి అయ్యింది. ఆమె పేరు పుష్ప కార్. దక్షిణ 24 పరగణాల జిల్లా సుందర్బన్ అడవుల దగ్గర సాగర్ దీవుల్లో నివసిస్తోంది. నదిలో ఓ చేప తేలుతూ ఆమెకు కనిపించింది. అది చాలా పెద్దగా ఉంది. వెంటనే నదిలో దూకిన ఆమె శక్తినంతా కూడగట్టి మరీ చేపను ఒడ్డుకు తెచ్చుకుంది. దేవుడే తనపై దయతలిచాడనుకుంది. ఆ చేపను తూకం వెయ్యగా 52 కేజీల బరువు ఉంది. అది మేలుజాతి చేప. దాని మాంసం కేజీ ఎంత పలికిందో తెలుసా రూ.6200. ఆ చేపను చూడగానే ఊరోళ్లంతా పనులన్నీ పక్కన పెట్టి పరుగెత్తుకొచ్చారు.

“ఎలా ఉందో చూడు. వామ్మో ఎంత పెద్దగా ఉందో. ఇది మన నదిలోనే దొరికిందా ముసలామె నక్క తోకను గట్టిగా తొక్కినట్లుంది”… అంటూ ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడుకున్నారు. చేప కనిపించినప్పుడు అది బతికి లేదు. లక్కేంటంటే అది ఓ పడవను ఢీకొని చనిపోయింది. అలా నీటిలో తేలుతున్న చేప ఈ ముసలామెకు చిక్కింది. స్థానికులు ముసలామెకు సహకరించి ఆ చేపను దగ్గర్లోని చేపల మార్కెట్‌కి తెచ్చారు. దాన్ని భోలా ఫిష్ (Bhola Fish) అని తేల్చారు. దాన్ని రూ.3 లక్షలకు కొన్నారు. ఒకరు వచ్చి ఆ చేపను రూ.3 లక్షలకు కొన్నారు. చచ్చిన చేపను కూడా అంత రేటు పెట్టి ఎందుకు కొన్నారంటే ముసలామెపై జాలితో కాదు. ఆ చేపను ఆగ్నేయ ఆసియా దేశాల్లో మందుల తయారీలో వాడుతారు. దాని ఎండిన తోలు ఖరీదు కేజీ రూ.80,000 దాకా పలుకుతోంది. అంటే ఆ కొనుక్కున్న వాళ్లు ఆ చేప ద్వారా దాదాపు 40 లక్షల దాకా సంపాదించుకోగలరు. పుష్ప కార్ మాత్రం తనకు రూ.3 లక్షలు దక్కడం ఎంతో అదృష్టంగా భావిస్తోంది.

ఒక్క చేపతో రాత్రికి రాత్రి లక్షాధికారి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts