‘ఆచార్య’ లో ఆ పాత్ర.. అమ్మ కల.. రామ్ చరణ్ క్లారిటీ.

September 15, 2020 at 4:00 pm

స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సైరా సినిమా చిరంజీవి కెరీర్లో డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను నిర్మించి తండ్రి కల నెరవేర్చారు రామ్ చరణ్. ఇక ఇంకొన్ని రోజుల్లో తల్లి కల కూడా నెరవేర్చబోతున్నారు. చరణ్ తన తల్లి కలను ఎలా నెరవేర్చబోతున్నారు అని అనుకుంటున్నారా… ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో ఓ పాత్రలో నటించి తల్లి కలను నెరవేర్చబోతున్నారట చరణ్.

చిరంజీవి హీరోగా కాజల్ హీరోయిన్ గా .. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో ఎంతో కీలకమైన 30 నిమిషాల నిడివి ఉండే అతిథి పాత్రలో గతంలో మహేష్ బాబు నటిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ తర్వాత సినిమాలో చరణ్ నటిస్తున్నాడు అంటూ టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. దీనిపై చరణ్ క్లారిటీ ఇచ్చారు. ఇటీవలే ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో… నేను నాన్న కలిసి ఒక తెరపై పాత్రల్లో కనిపించడం అమ్మ కల అని అది ఇన్నాళ్లకు ఆచార్య సినిమాతో నెరవేరబోతోంది అంటూ క్లారిటీ ఇచ్చారు రామ్ చరణ్.

‘ఆచార్య’ లో ఆ పాత్ర.. అమ్మ కల.. రామ్ చరణ్ క్లారిటీ.
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts