సీఎం జ‌గ‌న్‌తో న‌టుడు అలీ భేటీ.. అందుకేనా?

September 16, 2020 at 5:52 pm

సినీ నటుడు, కమెడియన్ అలీ గ‌త ఏడాది వైసీపీ అధినేత, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ ఖండువ క‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే నేడు ఏపీ సీఎం జగన్ తో అలీ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన అలీ… ముఖ్యమంత్రి జగన్మోహ‌న్ రెడ్డితో సమావేశమయ్యారు.

భేటీ అనంతరం మీడియాతో అలీ మాట్లాడారు. మర్యాద పూర్వకంగానే తమ నాయకుడిని కలిశానని, క‌రోనా సమయంలో సినిమా పరిశ్రమ గురించి సీఎం వాకబు చేశారని తెలిపారు. చిన్న వయసులో జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారని అలీ ప్రశంసించారు.

కాగా, ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరిన అలీ.. అప్పట్లో ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారని వార్త‌లు వచ్చాయి. గుంటూరు నుంచి అసెంబ్లీ బరిలో దిగాలని ఆయన భావించినట్టు ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఆయ‌న‌కు టికెట్ ల‌భించ‌లేదు. అయితే అలీకి ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎఫ్ డీసీ) చైర్మన్ పదవి ఇస్తారని కొన్ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ విష‌యంపై మాట్లాడేందుకే అలీ జ‌గ‌న్‌ను క‌లిసిన‌ట్టు స‌మాచారం.

సీఎం జ‌గ‌న్‌తో న‌టుడు అలీ భేటీ.. అందుకేనా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts