పెళ్లి పీట‌లెక్క‌బోతున్న తరుణ్.. అమ్మాయి ఎవ‌రంటే?

September 16, 2020 at 7:31 am

హీరో త‌రుణ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌‌రం లేదు. ఎన్నో తెలుగు చిత్రాల్లో బాల న‌టుడిగా న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన త‌రుణ్‌.. `నువ్వే కావాలి` చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో.. త‌రుణ్‌కు ఎక్క‌డా లేని క్రేజ్ వ‌చ్చింది. ఈ చిత్రం త‌ర్వాత ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, నిన్నే ఇష్టపడ్డాను, భలే దొంగలు, శశిరేఖా పరిణయం ఇలా ఎన్నో సినిమాలు చేసి ల‌వ‌ర్ బాయ్‌గా స్టార్ డ‌మ్ అందుకున్నాడు.

అయితే ఆ స్టార్ డ‌య్ కేవ‌లం రెండు, మూడు సంవ‌త్సారాలు మాత్ర‌మే న‌డిచింది. ఆ త‌ర్వాత త‌రుణ్ ఏ సినిమా చేసినా.. ఫ్లాప్ అవ్వ‌డంతో పాటు కొత్త హీరోలు వచ్చేయడంతో ఈయ‌న సైడ్ అయిపోయాడు. ప్ర‌స్తుతం బిజినెస్ చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈయ‌న గురించి ఓ వార్త తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. విష‌యం ఏంటంటే.. 37 ఏళ్ల‌ త‌రుణ్ త్వ‌రలోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

తరుణ్ అమ్మగారు రోజా రమణి చాలా రోజులుగా ఈయనకు మంచి సంబంధం వెతుకుతుంద‌ట‌. అయితే ఎట్ట‌కేల‌కు ఆ అమ్మాయి దొరికిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఓ స్నేహితురాలి కూతుర్ని తరుణ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ల అమ్మ ఫిక్స్ అయ్యార‌ని స‌మాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నార‌ని అంటున్నారు.

పెళ్లి పీట‌లెక్క‌బోతున్న తరుణ్.. అమ్మాయి ఎవ‌రంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts