ఎస్పీ బాలుకు అంతిమ వీడ్కోలు పలికిన స్టార్ హీరో విజయ్!

September 26, 2020 at 12:39 pm

భారతీయ సంగీత ప్రపంచ ఏక ఛత్రాధిపతి లెజెండరీ గాయకులు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం లేర‌న్న వార్త కుటుంబ‌స‌భ్యులను, సినీ ప్ర‌ముకుల‌ను, రాజ‌కీయ నాయ‌కులను, అభిమానుల‌ను ఇలా అంద‌రినీ శోకసంద్రంలో ముంచేసింది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా తామరైపాక్కంలో మరి కాసేపట్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి.

ఈ క్ర‌మంలోనే పలువురు ప్రముఖులు ఆయనను కడసారి చూసుకున్నారు. తాజాగా చివరి క్షణంలో తమిళ స్టార్ హీరో విజయ్ అక్కడకు వచ్చారు. బాలు భౌతికకాయాన్ని చూసి చలించిపోయారు‌. ఆయన పార్థివదేహానికి నమస్కరించి అంజలి ఘటించారు. అనంత‌రం పక్కనే ఉన్న బాలు కుమారుడు ఎస్పీ చరణ్ ని సముదాయించారు.

కాగా, సినీ ప్రముఖులు భారతీరాజాతో పాటు దేవి శ్రీ ప్రసాద్‌, శివబాలాజీ, మనో తదితరులు బాలు భౌతిక కాయాన్ని కడసారి చూసి నివాళులర్పించారు. అయితే కరోనా నిబంధనల నేపథ్యంలో దగ్గరి బంధుమిత్రులు, ప్రొటోకాల్ అధికారులను మాత్ర‌మే బాలు పార్థివదేహాన్ని చూసేందుకు పోలీసులు అనుమతిస్తున్నారు.

ఎస్పీ బాలుకు అంతిమ వీడ్కోలు పలికిన స్టార్ హీరో విజయ్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts