నెపోటిజంపై హీరోయిన్ ఆదాశ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

September 14, 2020 at 8:20 am

బాలివుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుథ్ మ‌ర‌ణంతో సినీ వ‌ర్గాల్లో నెపోటిజంపై తీవ్ర చ‌ర్చ కొన‌సాగుతున్న‌ది. ప‌రిశ్ర‌మ‌లో సినీ తార‌ల వార‌సుల‌పై విప‌రీత‌మైన విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై బాలివుడ్ రెండు వ‌ర్గాలుగా చీలిపోయింది. ఇప్ప‌టికే ప‌లువురు న‌టులు, న‌టీమ‌ణులు సినీ తార‌ల ఎంట్రీపై త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేయ‌డ‌మేగాక‌, దానిని వ్య‌తిరేకించారు కూడా. దీనిపై తాజాగా హీరోయిన్ ఆదాశ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ల‌ను చేశారు. ఓ పిల్లిక‌థ చెప్పి నెపోటిజాన్ని చ‌మ‌త్క‌రించారు. కొంత వ్యంగ్యాత్మ‌క ధోర‌ణిలో స్పందించారు.

ఇంత‌కీ ఏమ‌న్నారంటే.. నా ద‌గ్గ‌ర పిల్లిబొమ్మ‌ను పోలిన ఒక పిల్లో ఉన్న‌ది. దానికి రాధాశ‌ర్మ అని పేరు పెట్టాను. దానితో ర‌క‌ర‌కాల విన్యాసాల‌ను చేస్తుంటాను అదీగాక ఎక్క‌డికి వెళ్లినా ఆ దిండును నా వెంటే తీసుకెళ్తుంటా. నా త‌రువాత వార‌సురాలు అని ఇమేజ్‌ను ఆ దిండుకు తీసుకొచ్చా. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే దానికీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఖాతా ఉన్న‌ది. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల కోసం వ్యాపారులు దానిని అడుగుతుంటారు. దీనిని బ‌ట్టి మీరే అర్థం చేసుకోండి. వారసుల‌కు ఎలాంటి ప్రాధాన్య‌త ద‌క్కుతుందో ఆలోచించండి అంటూ వ్యంగ్యంగా స‌మాధాన‌మిచ్చారు. అదీగాక త‌న‌కు ఎలాంటి వార‌స‌త్వ నేప‌థ్యం లేక‌పోయినా పుష్క‌ర‌కాలంగా ఇండ‌స్ట్రీలో ఉన్నాన‌ని, ప్ర‌తిభ‌తో అవ‌కాశాలు వ‌స్తాయ‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం ఆదాశ‌ర్మ తెలుగులో క్వ‌శ్చ‌న్‌మార్క్ సినిమాలో కీల‌కపాత్ర‌ను పోషిస్తున్న‌ది.

నెపోటిజంపై హీరోయిన్ ఆదాశ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts