పెళ్లికి పెద్దల నిరాకరణ…ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

September 30, 2020 at 5:03 pm

తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కలిసి ఎలాగూ బతకలేకపోయాం..చావులోనైనా కలిసే ఉండాలని భావించారు. తమకు చావే శరణ్యమంటూ పురుగుల మందు తాగేశారు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… వనపర్తి జిల్లాలోని రేవల్లి మండలం గాంధీనగర్‌కు చెందిన యువకుడు నాగరాజు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆ యువతి గత కొంతకాలం నుంచి ఇంటి దగ్గర ఉంటోంది. ఆ యువతి కూడా నాగరాజును ప్రేమించింది.

పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ నిర్ణయాన్ని పెద్దల వద్ద ప్రస్తావించారు. తాము ప్రేమించుకున్నామని, ఒకరిపై మరొకరిరి విపరీతమైన ప్రేమ ఉందని తెలిపారు. తమకు వివాహం జరిపించాలని విన్నవించారు. అందుకు ఇరుకుటుంబాల సభ్యులు నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యారు. చనిపోవాలని నిర్ణయించుకున్నారు. పొలాలకు పిచికారి చేసే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

పెళ్లికి పెద్దల నిరాకరణ…ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts